Singer Pravasthi : ఇటీవల ‘పాడుతా తీయగా’ (Padutha Theeyaga) జడ్జిలు కీరవాణి (MM Keeravani), సింగర్ సునీత (Singer Sunitha), చంద్రబోస్ (Chandrabose) లపై షాకింగ్ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది సింగర్ ప్రవస్తి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఏ వార్త బయటకు వచ్చినా ఇట్టే వైరల్ అవుతోంది. అందులో భాగంగా తాజాగా తన వెనుక ఉన్నది యాంకర్ శ్రీముఖి, సింగర్ మంగ్లీ అంటూ ఆమె కామెంట్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ప్రవస్తి ఏం చెప్పిందంటే ?
శ్రీముఖి, మంగ్లీ సపోర్ట్
సింగర్ ప్రవస్తి వివాదం బయటకొచ్చినప్పటి నుంచి ఆమె చెబుతున్నది ఒక్కటే మాట. “నాకు డబ్బు లేదు, పలుకుబడి లేదు. 12 ఏళ్ల వయసు నుంచే కుటుంబ భారాన్ని మోస్తున్నాను” అని. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తనకు శ్రీముఖి, సింగర్ మంగ్లీ ఎలా సపోర్ట్ చేశారన్న విషయాన్ని ప్రవస్తి వెల్లడించింది.
అందులో ప్రవస్తి మాట్లాడుతూ “నేను మొదటి నుంచి ఎక్కడా నా పర్సనల్ విషయాలను, సమస్యలను బయట పెట్టలేదు. కానీ ఓ రోజు శ్రీముఖి అక్క నా దగ్గరకు వచ్చి యూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ థింగ్… అదేంటో స్టేజ్ పై చెప్పు ఈరోజు అని అన్నారు. దీంతో స్టేజ్ పైనే నా బాధలను చెప్పుకున్నాను. ఇక అక్కడే ఉన్న మంగ్లీ అక్క దగ్గరకు వచ్చి మేము నీకు సపోర్ట్ చేస్తామని చెప్పింది” అంటూ ‘పాడుతా తీయగా’లో ఓ ఎపిసోడ్ లో జరిగిన సంఘటనను వెల్లడించింది. వివాదంతో శ్రీముఖి, మంగ్లీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రవస్తి నోటి వెంట వారిద్దరి పేర్లు రావడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
యాంకర్ శ్రీముఖి సింగర్ ప్రవస్తి ఆరాధ్య పాల్గొన్న ‘పాడుతా తీయగా’ సింగింగ్ రియాలిటీ షోకు యాంకరింగ్ చేసింది. శ్రీముఖి తన యాంకరింగ్‌తో కార్యక్రమానికి జోష్ తీసుకొచ్చింది. ఈ షోలో ప్రవస్తి కంటెస్టెంట్‌గా పాల్గొని, తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆమె చివరి వరకూ కొనసాగలేదు. షో నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆమె జడ్జిలపై చేసిన కామెంట్స్, సింగర్ ప్రవస్తి ఆరాధ్య వివాదం తెలుగు సంగీత రంగంలో సంచలనం రేకెత్తించింది.
Read Also : డైరెక్టర్ దగ్గరికి వెళ్తే… బట్టలు విప్పి చూపించు.. అని అన్నాడు.
ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’ సింగింగ్ రియాలిటీ షోలో జడ్జిలైన సింగర్ సునీత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను కావాలనే టార్గెట్ చేశారని, బాడీ షేమింగ్ చేశారని, అన్యాయం చేశారని ప్రవస్తి ఆవేదనను వ్యక్తం చేసింది. కానీ సింగర్ సునీత ఈ వివాదంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ప్రవస్తి మాత్రం ఆమె చెప్పేవన్నీ అబద్దాలు అంటూ కొట్టి పారేసింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలి, దీనిపై చర్చిస్తున్నారు.