BigTV English

War 2: వార్ 2లో అలియా భట్.. ఇదెక్కడి ట్విస్ట్.. ఆ పోస్ట్ కి అర్థం అదేనా?

War 2: వార్ 2లో అలియా భట్.. ఇదెక్కడి ట్విస్ట్.. ఆ పోస్ట్ కి అర్థం అదేనా?

War 2: హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్(NTR ) కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య రాబోతున్న యాక్షన్ చిత్రం ‘వార్ 2’. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్’ పై ఆదిత్య చోప్రా (Adithya Chopra) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఎన్టీఆర్ తొలిసారి హిందీ సినీ రంగప్రవేశం చేస్తున్న చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం..


ఆకట్టుకున్న ట్రైలర్..

ఇదిలా ఉండగా ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జూలై 25న ట్రైలర్ విడుదల చేశారు. ప్రత్యేకించి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు హైలెట్గా నిలిచాయి. సినిమా క్లైమాక్స్ లో కూడా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాను నిలబెడతాయని అందరూ చెబుతున్నారు.


వార్ 2లో అలియా భట్.. నిజమేనా?

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పై ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చేసిన ఒక పోస్ట్ అనుమానాలు కలిగిస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలవుతోందంటే ఆ సినిమాలో ఎవరో ఒకరి పాత్రను సస్పెన్షన్ లో పెట్టి, సినిమా థియేటర్లలో వారిని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అలియా పాత్రను కూడా అలాగే చూపించబోతున్నారా? అనే అర్థం వస్తోంది ఆమె పెట్టిన పోస్ట్ ను చూస్తే.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న ట్రైలర్ రిలీజ్ చేయడంతో దీనిపై స్పందించిన అలియా భట్.. ఈ ట్రైలర్ ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ..” త్వరలోనే థియేటర్లలో కలుద్దాం” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో వార్ 2 లో అలియా భట్ ఉందా అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఒకవేళ ఉంటేనే కదా ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టింది అని కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఈ ముద్దుగుమ్మ నటిస్తోందో లేదో పూర్తి క్లారిటీ రావాలి అంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాల్సిందే.

లీక్ అయిన వార్ 2 స్టోరీ..

ఇక వార్ 2 సినిమా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.వార్ – 1 తర్వాత ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఇండియాకి రాకుండా విదేశాలలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. దీనికి కారణం.. దేశం కోసం ఎంత కష్టపడ్డా.. తనకు ఎటువంటి గుర్తింపు లేదని.. అందుకే అటు కుటుంబాన్ని, ఇటు దేశాన్ని, మంచి, చెడులను ఆఖరికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని కూడా వదులుకొని విదేశాలలోనే సెటిల్ అయిపోదామని నిర్ణయించుకుంటాడు. అయితే అనూహ్యంగా కబీర్ ని పట్టుకోవడానికి మరో మోస్ట్ వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్(ఎన్టీఆర్) ను ఇండియా రంగంలోకి దింపుతుంది. అయితే ఇక్కడ నెగటివ్ షేడ్స్ ఉన్న సోల్జర్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలే సినిమాకి హైలెట్ అని సమాచారం.

ALSO READ:Rekha vedavyas: ఆ వ్యాధితో ఏళ్ల పాటు నరకం.. అందుకే పెళ్లికి దూరం అంటున్న ఆనందం హీరోయిన్!

Related News

Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. ఇలా ఎప్పుడైనా చూశారా.. మెంటలెక్కిపోతుంది మావా

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

OG Trailer: ఓజీ ట్రైలర్ రిలీజ్.. హీరో కంటే ఆయనకే ఎక్కువ హైప్ ఇచ్చినట్టున్నారే?

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

Big Stories

×