Jabardasth Faima : బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth Faima) ద్వారా ఎంతో మంది నటీనటులు పాపులర్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లంతా ప్రస్తుతం కమెడియన్స్ గా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. ‘జబర్దస్త్’ (Jabardasth Faima) షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో ‘పటాస్’ ఫైమా కూడా ఒకరు. ఫైమా ముందుగా ‘పటాస్’ షోతో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘జబర్దస్త్’లో కూడా నటించి, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ అమ్మడు ఎందుకు ఇంతగా ఎమోషనల్ అయింది? అనేది తెలుసుకుందాం.
ఫైమా ఎమోషనల్
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన కొత్త మూవీ ‘తండేల్’ (Thandel). సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి, భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చద్దా, థాంక్యూ, కస్టడీ వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లతో సతమతమవుతున్న నాగచైతన్యకి ఈ మూవీ ఊరట ఇచ్చింది. ‘తండేల్’ హిట్ తో అక్కినేని అభిమానులు ఖుషిగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్ మూవీ అందమైన ప్రేమ కథగా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలోని లవ్ సీన్స్ కన్నీళ్లు తెప్పించాయని ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేశారు.
ఈ సినిమాకు, ఫైమా ఏడుపుకు సంబంధం ఏంటి ? అనుకుంటున్నారా… అయితే ఫైమా ఎమోషనల్ అయింది కూడా ‘తండేల్’ మూవీలోని ఆ సీన్స్ చూసే. ఈ మూవీని చూస్తూ ఆ ఎమోషనల్ సీన్స్ కి ఎంతగా కనెక్ట్ అయిందో ఆమె కన్నీటి పర్యంతం కావడం చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫైమా వీడియో తెగ వైరల్ అవుతుంది.
త్వరలోనే ఫైమ పెళ్లి…
‘పటాస్’ షో ద్వారా ఫైమా మాత్రమే కాకుండా ప్రవీణ్ కూడా పరిచయమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘జబర్దస్త్’, ‘పటాస్’ షోలలో ఎన్నో స్కిట్స్ లో నటించారు. అలాగే సన్నిహితంగా ఉంటూ యూట్యూబ్ వీడియోలు కూడా చేశారు. ఇక వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అనుకునేలోపే బ్రేకప్ చెప్పుకున్నారు. ఫైమా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి, ఐదేళ్లుగా అతనితో లవ్ లో ఉన్నాను అని చెప్పి ప్రకటించి షాక్ ఇచ్చింది.
ఇక రీసెంట్ గా ‘శ్రీదేవి డ్రామా’ కంపెనీలో ప్రవీణ్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ వెక్కివెక్కి ఏడ్చాడు. దీంతో వీరిద్దరూ స్టేజ్ పైన దాదాపు గొడవ పడినంత పని చేశారు. ఫైమా “నాకు పెళ్లి కుదిరింది అని చెప్పాక కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి టాపిక్ తీసుకొచ్చి, నెగటివ్ చేస్తున్నావు. జీవితంలో ఇంకోసారి నీతో మాట్లాడను” అంటూ తెగేసి చెప్పింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">