BigTV English

Jack Movie :సెన్సారు పూర్తి ..యు/ఎ… రెండు గంటల పది నిమిషాలు లెంగ్త్.

Jack Movie :సెన్సారు పూర్తి ..యు/ఎ… రెండు గంటల పది నిమిషాలు లెంగ్త్.

Jack Movie:స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ,వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ,రొమాంటిక్ యాక్షన్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి. వి.ఎస్ఎన్ ప్రసాదు, బాపినీడు, సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బేబీ సినిమా తర్వాత వైష్ణవి నటిస్తున్న సినిమా కావడం విశేషం. ‘జాక్ కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్.ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు పాటలకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ తో భాగంగా ఇప్పటికే హీరో, హీరోయిన్స్ ,డైరెక్టర్లు చాలా బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..


సెన్సార్ పూర్తి చేసిన జాక్ ..

ఈ చిత్రంలో కీలక పాత్రలో ప్రకాష్ రాజు, నరేష్ ,బ్రహ్మాజీ వంటి వారు నటిస్తున్నారు..డీజే టిల్లు, ‘టిల్లు స్క్వేర్’ సినిమాల తర్వాత సిద్దు నుండి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్లే బాయ్ గెటప్ లో సిద్దు టిల్లు, ‘టిల్లు స్క్వేర్’ సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఇప్పుడు ‘జాక్’ సినిమా తో ఏప్రిల్ 10వ తేదీ న మన ముందుకు రానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ పూర్తయినట్లు సమాచారం. సెన్సార్ పూర్తి చేసి U/A సర్టిఫికెట్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నిడివి రెండు గంటల పది నిమిషాలు ఉంటుందని సమాచారం. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిబంధనల ప్రకారం మేకర్స్ సినిమా లో ఉన్న కొన్ని డైలాగ్స్ ను కట్ చేసినట్లు సమాచారం . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ ఇప్పటికే సినిమా పై హైప్ ను క్రియేట్ చేశారు.ఈ సినిమాలో చార్మినార్ ఎపిసోడ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఈ సినిమాపై మంచి క్రేజ్ ని క్రియేట్ చేశారు మూవీ మేకర్స్.టిల్లు స్క్వేర్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు స్టార్ బాయ్ సిద్దు. మరి తర్వాత వస్తున్న సినిమా కావున దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.


థియేటర్ లో కలుద్దాం అంటున్న సిద్దు..

ఈ సినిమా ట్రైలర్ లో సిద్దు,నరేష్ కామెడీ సన్నివేశాలు అధ్యంతం నవ్వులు కురిపించాయి. తండ్రీ కొడుకుల పాత్రలో ఇద్దరూ కనిపించనున్నారు. నరేష్ తండ్రి పాత్రలో చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి .ఇందులో సిద్దు ఒక సీక్రెట్ ఏజెంట్ గా, డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలయ్యి ఫన్ డ్రామా, సస్పెన్స్, లవ్ ట్రాక్ వంటి అంశాలతో ఆధ్యాంతం ట్రైలర్ ఆకట్టుకుంది.ఏది ఎలా ఉన్నా ఈ సినిమా ఏప్రిల్ 10 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘కిస్’ సాంగ్ ,ప్రమోషన్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు.వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×