BigTV English

Movies Releasing in Theatres :ఈ వారం విడుదలకు సిద్ధమవుతున్న కొత్త సినిమాలు ఇవే..?

Movies Releasing in Theatres :ఈ వారం విడుదలకు సిద్ధమవుతున్న కొత్త సినిమాలు ఇవే..?

Movies Releasing in Theatres :అసలే సమ్మర్ మొదలవుతోంది. అప్పుడే భగభగ మండే సూర్యుడు నిప్పులు చెరుగుతూ ప్రజలపై తన ప్రభావం చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను మరింత కూల్ చేయడానికి.. అటు ఇండస్ట్రీ కూడా పలు రకాల జానర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి.. పలు ఆసక్తికర ప్రాజెక్టులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఏప్రిల్ రెండవ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.


జాక్: ఏప్రిల్ -10 (సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య)..

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) , హీరోగా.. టాలెంటెడ్ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్గా రాబోతున్న చిత్రం ‘జాక్: కొంచెం క్రాక్’.. ఈనెల 10వ తేదీన బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఒక రహస్య ఆపరేషన్ కోసం రంగంలోకి దిగిన జాక్ అనే యువకుడిగా వినోదం పంచడానికి సిద్దు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ఆపరేషన్ ఏంటి? అని తెలియాలి అంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా.. నిర్మాత బాపినీడు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


జాట్: ఏప్రిల్ 10 ( సన్నీ దేవోల్ , రెజీనా, సయామీ ఖేర్)

ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వంలో సన్నీ దేవోల్(Sunny Deol), రెజీనా కసాండ్రా(Regina Cassandra) , సయామీ ఖేర్ (Sayami Kher) ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘జాట్’. ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఒక తీర ప్రాంతంలోని గ్రామాన్ని శాసించే విలన్ కి హీరో ఎలా బుద్ధి చెప్పాడు? అనేది ఈ సినిమా కథ. యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఈ సినిమా సాగనుంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ : ఏప్రిల్ 10 (అజిత్ కుమార్ – త్రిష)

ఎప్పుడో సంక్రాంతికి విడుదల కావాల్సిన అజిత్ (Ajith) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది .ఇక ఇప్పుడు ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అజిత్ కుమార్ హీరోగా, త్రిష (Trisha).హీరోయిన్ గా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అజిత్ విభిన్నమైన గెటప్లో కనిపించనున్నారు. ఆపదలో ఉన్న తన కుమారుడిని కాపాడుకోవడానికి రిటైర్డ్ గ్యాంగ్స్టర్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు ? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, కామెడీతో అజిత్ తన మార్క్ చూపించనున్నారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి: ఏప్రిల్ 11 (ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి)

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా మారిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), ఇప్పుడు మరో యాంకర్ , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీపిక పిల్లి (Deepika Pilli) తో జతకట్టి ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు నితిన్ – భరత్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్, కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

కౌసల్య తనయ రాఘవ : ఏప్రిల్ 11 ( రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి)

స్వామి పట్నాయక్ దర్శకత్వంలో రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘కౌసల్య తనయ రాఘవ’. ఈ ప్రేమ కథ చిత్రం ఈనెల 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Small Screen: 9 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బుల్లితెర జంట.. ఎవరంటే?

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×