BigTV English

Jacqueline Fernandez: జాక్వెలిన్ పాట హిట్టయితే గిఫ్ట్ గా 100 ఐఫోన్ ప్రోలు… ఇదెక్కడి రాక్షస ప్రేమరా సామీ!?

Jacqueline Fernandez: జాక్వెలిన్ పాట హిట్టయితే గిఫ్ట్ గా 100 ఐఫోన్ ప్రోలు… ఇదెక్కడి రాక్షస ప్రేమరా సామీ!?

Jacqueline Fernandez : హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై సుఖేష్ చంద్రశేఖర్ చూపిస్తున్న రాక్షస ప్రేమ మామూలుగా లేదు. క్రిమినల్ అయినప్పటికీ ఆమెపై ఉన్న ప్రేమను సినిమా స్టైల్ లో ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాడు. జాక్వెలిన్ అతని గురించి ఏం ఆలోచిస్తుందో తెలియదు గానీ సందర్భం వచ్చినప్పుడల్లా అతను చేసే అనౌన్స్మెంట్ చూస్తే ప్రేమికుడు అంటే ఇలా కూడా ఉంటారా? అనే అనుమానం కలుగుతోంది. తాజాగా జాక్వెలిన్ కొత్త సాంగ్ రిలీజ్ అయిన నేపథ్యంలో సుఖేష్ ఆ పాటను హిట్ చేస్తే, 100 మందికి ఐఫోన్ లేటెస్ట్ మోడల్ లతో పాటు థార్ కార్లను గిఫ్ట్ గా ఇస్తానంటూ దిమ్మతిరిగే ప్రకటన ఇచ్చాడు.


100 ఐఫోన్ ప్రోలు, 10 మహీంద్రా థార్ ఎస్యూవీలు గిఫ్ట్స్ 

భారీ మోసాలకు పేరుగాంచిన సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరోసారి కొత్త ప్రమోషనల్‌ స్టంట్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల లక్కీ విజేతలకు 100 ఐఫోన్ 15 ప్రోస్ అందించిన సుకేష్ ఇప్పుడు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అభిమానులకు 10 మహీంద్రా థార్ రోక్స్ ఎస్యూవీలు, 100 ఐఫోన్ 16 ప్రోలను బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. తన అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖలో జాక్వెలిన్ తాజా పాట ‘స్టోర్మ్‌రైడర్‌’ను ప్రమోట్ చేస్తే ఈ బహుమతిని అందుకోవచ్చని సుఖేష్ వివరించాడు.


కండిషన్స్ అప్లై 

లేఖలో సుఖేష్ “బయట ఉన్న అందమైన వ్యక్తులందరికీ, ముఖ్యంగా జాకీ అభిమానుల కోసం.. నేను ‘స్టోర్మ్‌రైడర్‌’ సాంగ్ ను సపోర్ట్ చేసే వారీకి 10 మహీంద్రా థార్ రోక్స్, 100 ఐఫోన్ 16 ప్రోలను అందివ్వబోతున్నాను. ఈసారి మేము మళ్లీ లక్కీ డ్రా ఆటను ప్రారంభించాము.. గాయ్స్ ‘స్టోర్మ్‌రైడర్‌’ ట్రాక్‌లో జాకీ మీ కోసం చాలా కష్టపడ్డారు. మీరందరూ స్టోర్మ్‌రైడర్‌ను పెద్ద హిట్‌గా మార్చాలని నేను కోరుకుంటున్నాను’ అంటూనే కండిషన్స్ ను కూడా వెల్లడించాడు. లక్కీ డ్రాలో పాల్గొనాలంటే పాటను చూడాలని, జాక్వెలిన్ యూట్యూబ్ ఛానెల్‌ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలని, పాట 100 మిలియన్ల వీక్షణలను చేరుకోవడంలో సహాయపడాలని అభిమానులను కోరాడు. డ్రాలో విజేతలను దీపావళి రోజున ప్రకటిస్తారు. థార్ రోక్స్ వాహనాలకు సంబంధించిన అన్ని పన్నులు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పూర్తిగా తనే భరిస్తానని ఆయన తెలిపారు.

బెయిల్ వచ్చినా జైల్ లోనే.. 

200 కోట్ల భారీ కుంబకోణంలో జైలుకు వెళ్ళిన సుఖేష్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతను విచారణలో హిందీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆమెను కూడా ఈ కేసులో విచారించగా, జాక్వెలిన్ ఇందులో కేవలం బాధితురాలు అని అన్నారు. కానీ సుఖేష్ మాత్రం ఆమెను వదలట్లేదు. ఎప్పటికప్పుడు జైలు నుంచే ప్రేమ లేఖలు రాస్తూ జాక్వెలిన్ పై తనకున్న ప్రేమను బయట పెడుతున్నాడు. ఇటీవలే ఆమె కోసం చంద్రునిపై స్థలం కొన్నట్టు వెల్లడించాడు. కాగా తొమ్మిదేళ్ల నాటి కేసులో బాంబే హైకోర్టు అతనికి ఇటీవల బెయిల్ మంజూరు చేసినప్పటికీ, అతనిపై అనేక ఇతర అభియోగాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున సుఖేష్ జైలులో ఉన్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×