BigTV English
Advertisement

Jai Hanuman: రేవతి కేసు ఇంకా ముగియలేదు.. మైత్రీ మూవీ మేకర్స్ పై మరో కేసు

Jai Hanuman: రేవతి కేసు ఇంకా ముగియలేదు.. మైత్రీ మూవీ మేకర్స్ పై మరో కేసు

Jai Hanuman: ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ  మూవీ మేకర్స్ కు ఈ ఏడాది తిప్పలు తప్పేలా లేవు.  కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. ఇండస్ట్రీకి హిట్లు ఇచ్చే బ్యానర్ కే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరు సాధించలేని రికార్డ్ ను మైత్రీ  సాధించింది. వారు నిర్మించిన పుష్ప సినిమా నేషనల్ అవార్డును అందుకుంది. ఆ బ్యానర్ లో వచ్చిన పుష్ప 2 రికార్డ్ కలక్షన్స్  కొల్లగొట్టింది.


ఇక ఇవన్నీ పక్కన పెడితే .. గతేడాది  సంధ్యా థియేటర్  తొక్కిసలాట కేసులో మైత్రీ మూవీ మేకర్స్ ను  కూడా నిందితులుగా  పోలీసులు చేర్చారు.  ఇక అల్లు అర్జున్ కన్నా ముందే రేవతి మృతిపై మైత్రీ రియాక్ట్ అయ్యింది. శ్రీతేజ్ కు ఎలాంటి అవసరమొచ్చినా తాము ఉంటామని ధైర్యాన్ని ఇచ్చింది. అంతేకాకుండా శ్రీతేజ్ కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందించింది.

Sreemukhi: నేనూ హిందూ కుటుంబంలోనే పుట్టాను.. దయచేసి క్షమించండి


ఇక ప్రస్తుతం రేవతి కేసు కొద్దిగా చల్లబడింది. బన్నీ బెయిల్ పై బయటకొచ్చాడు. నిన్ననే శ్రీతేజ్ ను కూడా పరామర్శించాడు. ఇప్పుడిప్పుడే ఈ వివాదం ముగుస్తుంది అనుకొనేలోపు మైత్రీపై మరో కేసు నమోదయ్యింది. మరోసారి నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ పై కేసు నమోదు అయ్యింది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  యూనివర్స్ లో సూపర్ హీరోల సినిమాల్లో హనుమాన్ సినిమా  మొదటిది. ఈ సినిమా  భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ  సూపర్ హీరోల సినిమాలకు కొనసాగింపుగా జై హనుమాన్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హనుమంతుడిగా రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. గతేడాది ఈ సినిమా నుంచి హనుమంతుని లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టర్ వివాదానికి గురి అయ్యింది.

Sudigali Sudheer: మళ్లీ బుల్లితెర బాట పట్టిన సుధీర్.. ఇదే దిక్కు కానుందా..?

హనుమాన్ సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమాలో హనుమంతుని ముఖ చిత్రం బదులు హీరో రిషబ్ శెట్టి మొహాన్ని చూపించారని న్యాయవాది తిరుమల్ రావు నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు వేశాడు. చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌తో పాటు నటుడు రిషబ్ శెట్టిపై ఆయన ఫిర్యాదు  కూడా ఫిర్యాదు చేశాడు.

“హనుమంతుని ముఖ చిత్రాన్ని చూపించడానికి బదులుగా, టీజర్‌లో నటుడు రిషబ్ శెట్టి ముఖాన్ని చూపించారు. ఇది హనుమంతుని ప్రతిమకు హాని కలిగిస్తుంది. భవిష్యత్ తరాలకు హనుమంతుడు ఎవరో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. జర్ లో హనుమంతుని కించపరిచేలా సీన్స్ ఉన్నాయి” అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  మరి ఈ కేసుపై మైత్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×