Sreemukhi: హాట్ యాంకర్ శ్రీముఖి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఒక ఈవెంట్ లో శ్రీముఖి హిందువుల మనోభవాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసింది. గలగలా మాట్లాడే శ్రీముఖి.. ఎప్పుడు ఇలా నోరుజారి మాట్లాడింది లేదు. పేరు మర్చిపోవడమో.. తప్పుగా మాట్లాడడమో చేస్తే పొరపాటులే అని వదిలేస్తారు కానీ.. దేవుళ్ల గురించి తెలిసి తెలియకుండా మాట్లాడితే మాత్రం నెటిజన్స్ అస్సలు వదలరు.
ఈ మధ్య జరిగిన ఒక సంక్రాంతి ఈవెంట్ లో శ్రీముఖి దిల్ రాజు బ్రదర్స్ ను పొగుడుతూ .. ” రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనేది మనం అప్పట్లోనే విన్నాం. కానీ, సాక్ష్యాత్తు రామలక్ష్మణులు నా కళ్ళముందు కూర్చున్నారు ఒకరు దిల్ రాజు.. ఇంకొకరు శిరీష్” అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sreemukhi: రామలక్ష్మణులు ఫిక్షనలా.. ఛీఛీ.. నీకు సిగ్గుందా.. హిందూ కుటుంబంలోనే పుట్టావా.. ?
రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో హిందువులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. నీ ముత్తాత ఎవరో నీకు తెలియదు అలా అని వారు ఫిక్షనల్ అవుతారా.. ? వారు లేకపోతే మరి నువ్వెలా పుట్టావు.. నువ్వసలు హిందువేనా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. నోరు జారీ మాట్లాడినందుకు హిందులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక తన తప్పు తెలుసుకున్న శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా హిందువులకు క్షమాపణలు చెప్పుకొచ్చింది. ” అందరికీ నమస్కారం. రీసెంట్ టైంలో నేను హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణులను ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువునే. నేను దైవ భక్తురాలినే. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ, నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి.
Malladi Vassishta : డైరెక్టర్ వశిష్ఠ బర్త్ డే స్పెషల్.. ఎవరికి తెలియని సంచలన నిజాలు..!
ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్తపడతాను అని మీ అందరికి మాటిస్తూ.. మీ అందరికి క్షమాపణ కోరుతూ.. దయచేసి పెద్దమనుసుతో మీరు క్షమిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ క్షమాపణపై కూడా పలువురు పలురకాలుగా స్పందింస్తున్నారు.
చిన్నపిల్ల పొరపాటు జరిగిందంటుంది వదిలేయండి అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం ముందు వెనుక తెలుసుకోకుండా మాట నేయడం.. ఆ తరువాత ఇలా ఎవరైనా మండిపడితే సారీ చెప్పడం అలవాటుగా మారిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్రీముఖి క్షమాపణలతో హిందూ సంఘాలు శాంతిస్తాయో లేదో చూడాలి.