Sudigali Sudheer:ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా తన టాలెంట్ నిరూపించుకోవడానికి వచ్చిన ఈయన మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసి , ఆ తర్వాత కమెడియన్ గా మారిపోయారు. అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిన సుధీర్, తన స్నేహితులైన రాంప్రసాద్ (Ram Prasad), గెటప్ శ్రీను (Getup Sreenu) లతో కలిసి పదుల సంఖ్యలో స్కిట్లు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ (Jabardast) ప్రారంభమై నేటికి 13 సంవత్సరాలకు పైగానే అవుతున్నా. ఇప్పటికీ ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ షో ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అందులో కొంతమంది హీరోలుగా, ఇంకొంతమంది దర్శకులుగా, మరికొంతమంది కమెడియన్స్గా సెటిలైపోయారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి సుడిగాలి సుధీర్ చేరిపోయిన విషయం తెలిసిందే.
మొదట సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా కెరియర్ ఆరంభించిన ఈయన, ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేశారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల గాలోడు సినిమాతో పరవాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించి అప్డేట్స్ లేవనే చెప్పాలి. అయితే సడన్గా ఈయన మళ్ళీ బుల్లితెరపై కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మళ్లీ బుల్లితెరపై తన క్రేజ్ ను పెంచుకోవడం కోసం రష్మీ తో జత కలిపారు. ఒకప్పుడు వీరికున్న క్రేజ్ తో ఇద్దరికీ పెళ్లి, స్వయంవరం లాంటివి కూడా చేశారు మేకర్స్. అయితే ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరిని కలిపి మళ్ళీ ఒక పెద్ద ప్రోగ్రాంను ప్లాన్ చేశారు.
సంక్రాంతి పండుగకు ఈటీవీలో టెలికాస్ట్ కాబోతున్న ఒక ప్రోగ్రాం కి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. అదే “సంక్రాంతికి వస్తున్నాం” అంటూ ఒక పెద్ద ప్రోగ్రాంను ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో సుధీర్ , రష్మీ ఇద్దరి మధ్య మళ్ళీ లవ్ సీన్స్ లో ప్రోగ్రాం పై భారీగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. అంతేకాదు ఈ ప్రోగ్రాం కి వీరిద్దరూ యాంకర్ గా కూడా చేశారు. ఇది వరకు లాగే రష్మి పై పంచులు వేసే కార్యక్రమం చాలా గట్టిగానే జరిగింది. ఇక వీళ్లిద్దరిని ఇలా చూసి.. నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అభిమానులైతే సంబరపడిపోతున్నారు. ఇక మా అన్న , వదిన వచ్చారు. అసలు పండుగ మొదలయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే ఇది చూసిన చాలామంది వెండితెరపై అవకాశాలు లేకే ఇలా బుల్లితెరపైకి మళ్ళీ వచ్చారు.. ఇక ఇదే ఆయనకు దిక్కు కానుంది అంటూ రకరకాల కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం. మరి పెద్ద పండుగ ప్రోగ్రాం కాబట్టి ఈ ఒక్కసారికే ఆయన యాంకరింగ్ చేస్తున్నారా? లేక మళ్ళీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా సుధీర్ మళ్లీ బుల్లితెరపై కనిపించేసరికి పలువురు పలు రకాల కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు