BigTV English

Vigilance on HCA : SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!

Vigilance on HCA :  SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!

Vigilance on HCA : HCA అక్రమాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిగింది. HCA  సెక్రెటరీ srh ఫ్రాంచైజీ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్టు నిర్థారణ అయింది. టికెట్ల కోసం SRH యజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసినట్టు తేలింది. ఇప్పటికే 10 శాతం టికెట్లను SRH యజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసినట్టు తేలింది. ఇప్పటికే 10 శాతం టికెట్లను SRH ఫ్రీ గా  ఇస్తోంది. అయితే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ పై HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ నిర్దారించింది. 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా మరో 10 శాతం అదనంగా టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తేల్చింది. మరో 10 శాతం ఇచ్చేది లేదని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తేల్చి చెప్పింది. దీంతో SRH ను ఇబ్బందులకు గురి చేస్తూ.. లక్నో మ్యాచ్ సందర్భంగా VIP గ్యాలరీలకు HCA  లాక్ వేసినట్టు ప్రభుత్వానికి విజిలెన్స్ ప్రాథమిక నివేదిక సమర్పించింది.


Also Read :  Memes on MI : అంపైర్లకు అంబానీ వార్నింగ్.. థర్డ్ డిగ్రీ ఇచ్చి మరీ !

ఉచితంగా 10 శాతం టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ఆర్ హెచ్ యజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ మోహన్ రావు డిమాండ్ చేసారు. HCA ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తనకు వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు కావాలని జగన్ మోహన్ డిమాండ్ చేసినట్టు విచారణలో తేలింది. SRH టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ ల సందర్భంగా ఇబ్బందులు గురి చేశారు జగన్. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేశారు. SRH ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా విజిలెన్స్ నివేదికలో నిర్థారణ అయింది. హెచ్ సీఏ పై చర్యలకు విజిలెన్స్ ఆదేశించింది.


ఈ ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కోటకోట శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో హెచ్ సీఏ అక్రమాలు,  టికెట్ల దుర్వినియోగం, అధిక ధరలకు విక్రయించడం వంటి విషయాలు ధృవీకరించారు. కాగా ఏప్రిల్ 2న హెచ్సీఎ, సన్ రైజర్స్ మధ్య చర్చలు జరిగి, 3,900 టికెట్ల ఒప్పందాన్ని కొనసాగించడానికి రెండు పక్షాలు అంగీకరించాయి. హెచ్సీఎ ఇకపై ఒత్తిడి చేయదని హామీ ఇచ్చింది. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్, చివరి మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించింది. కానీ మధ్య లో జరిగిన కొన్ని మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్ లు ఆడింది. అందులో 6 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగింది.

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×