JanaNayagan Shooting Update : శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు తలపతి విజయ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన త్రీ ఇడియట్స్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చాయి.
స్నేహితుడు సినిమా తర్వాత విజయ్ ది తెలుగులో రిలీజ్ అయిన సినిమా తుపాకీ. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు ఏఆర్ మురగదాస్. ఈ సినిమా మహేష్ బాబు లాంటి హీరోకి పడి ఉంటే అద్భుతమైన హిట్ అయ్యేదని అందరూ అంటుంటారు.
అట్లీ ఇచ్చిన హిట్ సినిమాలు
ఇకపోతే ఆ తర్వాత విజయ్ సినిమాలు కూడా తెలుగులో అనువాదంగా రిలీజ్ అయ్యాయి. కానీ అవన్నీ అంతంత మాత్రమే ఆడాయి. అట్లీ దర్శకత్వంలో వచ్చిన అదిరింది విజిల్ వంటి సినిమాలు ఇక్కడ మంచి ఆదరణ పొందుకున్నాయి. ఖైదీ సినిమాతో లోకేష్ కనకరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అక్కడితో లోకేష్ కనకరాజ్ సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడం మొదలెట్టారు. అలానే లోకేష్ తీసిన మాస్టర్, విక్రమ్, లియో సినిమాలను ఆదరించారు.
అప్పటి నుంచే మొదలు
విజయ్ చివరిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమాను చేశాడు. తలపతి విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో తన 69వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి జననాయగన్ అనే టైటిల్ ఖరారులో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ అవుట్ డోర్ షూటింగ్ కొడైకెనాల్ లో చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మొత్తానికి ఒకటే అవుట్ డోర్ షూట్ ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ మే ఫస్ట్ వీక్ లో మొదలుకానుంది. ఇదే ఫైనల్ షెడ్యూలు అని కూడా తెలుస్తుంది. ఈ సినిమాను జనవరి 9న 2026న రిలీజ్ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.విజయ్ ప్రస్తుతం కంప్లీట్ గా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక విజయ్ రాజకీయ సభలకు కూడా పెద్ద ఎత్తున జనాలు హాజరవుతున్నారు. విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో త్వరలో తెలియనుంది. కొన్ని సభలలో విజయ్ మాట్లాడిన మాటలు బాగానే ఆకట్టుకున్నాయి.
Also Read : నాగార్జునపై తీవ్ర ఆరోపణలు చేసిన యూట్యూబర్ అన్వేష్, చిక్కుల్లో పడతాడా?