Singer Pravasthi : పాడుతా తీయగా కార్యక్రమం ఎస్పీ బాలసుబ్రమణ్యం 1996లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతుంది. ఆయన మరణం తర్వాత కొన్ని రోజులు ఈ షో ఆపేసిన తరువాత మళ్ళీ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మొదలుపెట్టాడు. ఇన్ని రోజుల నుంచి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్న షో.. సింగర్ ప్రవస్తి సంచలన వ్యాఖ్యలతో షోలో జరిగే విషయాలన్నీ బయటికి వచ్చాయి. ప్రవస్తి పాడుతా తీయగా షోకి కంటెస్టెంట్ గా వెళ్లారు. అక్కడ ఆమె ఎలిమినేట్ అయ్యారు. సింగర్ సునీత వల్లే తను టార్గెట్ అయ్యి.. అక్కడ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని, జడ్జిల గురించి కూడా కామెంట్స్ చేసింది. దీనిపై సునీత వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో పై ప్రవస్తి స్పందింది.. ఆ వివరాలు ఇలా…
వాళ్ళ సపోర్టు చేయటం మానేశారు ..
తాజాగా సింగర్ ప్రవస్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ షో నుంచి బయటికి రావడానికి కారణం సునీత. ఇప్పటివరకు నన్ను ఎంతోమంది సపోర్ట్ చేశారు. కానీ, ఆమె వీడియో చేసి పెట్టిన తరువాత నాకు సపోర్ట్ చేసేవారు నాకు దూరం అయ్యారు. దానికి కారణం నాకు పొజిషన్ లేదు. నేను సాధారణ మనిషిని.. నేను పాటలు పాడుకునే స్టేజ్ లోనే ఉన్నాను. వారంతా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు, వాళ్ళ సపోర్టు కోసం ఆశపడే వాళ్ళు నా వెనుక రావడం మానేశారు. ఇలా నాకు జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదని నేను ఇలా ఇంటర్వ్యూల ద్వారా బయటికి వచ్చాను. ఈ షోలో జరిగినట్టుగా ఏ షోలోను జరగదు. ఈటీవీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు అని మాత్రం చెప్పారు అంటే తప్పు జరిగిందనే కదా అర్థం. అందుకే నేను పోరాడుతున్నాను. ఇప్పటివరకు నేను చాలా షోలలో పాటలు పాడాను కానీ, ఇలా ఎప్పుడు అవమానం జరగలేదు.
నన్ను ఎవరు బెదిరించిన నేను భయపడను .
సునీత చెప్పినట్టు మా అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్లి ఏమీ అనలేదు. నాకు ట్రోఫీ ఇవ్వడం ఆమెకి నచ్చక నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్లడానికే మా అమ్మ అక్కడికి వచ్చింది. ఆమె చెప్పినట్లు ఏమీ జరగలేదు. మమ్మల్ని పాటలు సెలక్ట్ చేసుకోమని చెప్తారు కానీ, వాళ్లే పాటలు ఇస్తారు. నేను ఎన్ని పాటలు సెలెక్ట్ చేసినా వాటిని రిజెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు మాకు ఛాయిస్ లేకుండా మేము ఎలా పాట పాడతాము. ఇవన్నీ ఎవరు బయటకు చెప్పరు. కానీ నేను బయటికి చెప్తున్నాను. నాకైతే ఎవరి నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి, బెదిరిస్తున్నారు. ఇలా నన్ను ఎవరు భయపెట్టలేరు. నాకు ఇకమీదట అవకాశాలు రాకపోవచ్చు కానీ, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మళ్లీ మీ ముందుకి వస్తాను అని ప్రవస్తి తెలిపింది.
Shiva Jyothi : నువ్వు లేకపోతే నేను… శివజ్యోతి ఎమోషనల్ వర్డ్స్