Allu Arjun.. అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2′(Pushpa 2). రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ సాధించినప్పటికీ ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు చిత్ర బృందం.
బెనిఫిట్ షో.. బన్నీ కారణంగా మహిళ మృతి..
అసలు విషయంలోకెళితే డిసెంబర్ 4వ తేదీన అర్ధరాత్రి బెనిఫిట్ షోలో వేసిన విషయం తెలిసిందే. ఈ బెనిఫిట్ షోలు చూడడానికి హైదరాబాదులోని సంధ్య థియేటర్ కి పెద్ద ఎత్తున ఆడియన్స్ తరలివచ్చారు. అయితే అదే సమయంలో ఆ థియేటర్లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా రావడంతో, అల్లు అర్జున్ ని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జి చేసిన విషయం తెలిసిందే. ఇక అక్కడ తొక్కిసలాట జరగగా ఆ తొక్కిసలాటలో రేవతి అనే 39 సంవత్సరాల వయసున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కొడుకు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నట్లు సమాచారం.
బాధిత కుటుంబానికి అండగా అల్లు అర్జున్..
దీనిపై స్పందించిన అల్లు అర్జున్..” ఈ విషాద ఘటనకు చింతిస్తున్నాను. ఇప్పటివరకు సంధ్య థియేటర్లో ఎన్నో బెనిఫిట్ షోలు వేశారు. కానీ ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదు. అయితే బాధిత మహిళా కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు, ఆమె భర్తకి ఉద్యోగం ఇచ్చి, ఆమె కొడుకు ఆరోగ్యంగా బయటకు వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని” తెలిపారు.
అల్లు అర్జున్ పై మండిపడ్డ జనసేన అడ్వకేట్..
అయితే దీనిపై మండిపడ్డారు జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ సింగలూరి. ఈయన తన అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా ఇలా పోస్ట్ చేశారు. “నీకు సినిమా పారితోషకం రూ.300 కోట్లు కావాలా? సినిమా కలెక్షన్లు రూ.2000 కోట్ల పైన ఉండాలా? నీ సినిమాకి వచ్చే.. అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం రూ.25 లక్షలు మాత్రమే ఇస్తావా? నీకు, నీ నిర్మాతలకు సిగ్గు, శరం, ఉచ్చ నీచం ఉందా? మిమ్మల్ని మనుషులు అంటారా? మానవత్వం ఉందా? కేసు మాఫీ కోసం ముష్టి వేశారా? అంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
స్టార్ హీరోలకి టార్గెట్ ఫిక్స్..
ఇది కాస్త పక్కన పెడితే అల్లు అర్జున్ తన సినిమాతో మొదటి రోజే భారీ కలెక్షన్స్ రాబట్టారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR), బాహుబలి2(Bahubali 2)లాంటి సినిమాల రికార్డులను కూడా ఒక్క దెబ్బతో బ్రేక్ చేసేసారు అల్లు అర్జున్. ముఖ్యంగా ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు ఎన్నో సినిమాలను విడుదల చేశారు. కానీ ఎవరూ ఈ సినిమాలను టచ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఎవరూ కూడా తన రేంజ్ ని దాటలేరు అనేంతగా టార్గెట్ ఫిక్స్ చేసి పడేశారు అల్లు అర్జున్. ఏది ఏమైనా పుష్ప -2 సినిమాతో ఆల్ టైం రికార్డ్ సృష్టించారు అల్లు అర్జున్.
నీకు సినిమా పారితోషకం 300 కోట్లు కావాలా? సినిమా కలెక్షన్లు 2,000 కోట్ల పైన ఉండాలా?
నీ సినిమా కి వచ్చి అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం 25 లక్షలు మాత్రమే ఇస్తావా? సిగ్గుశరం, ఉచ్చనీఛం ఉందా నీకు, నీ నిర్మాతలకు?
మిమ్మల్ని మనుషులంటారా? మానవత్వం ఉన్నదా? కేసు మాఫీ కోసం ముష్టా?
— Shanti Prasad Singaluri (@ShantiSingaluri) December 6, 2024