Janasena:బన్నీ వాసు (Bunny Vasu)నిర్మాతగా, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మిస్తూ.. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా మెగా – అల్లు కుటుంబాలలో అత్యధికంగా కనిపించే వ్యక్తులలో నిర్మాత బన్నీ వాసు కూడా ఒకరు. అంతేకాదు అల్లు ఫ్యామిలీ మెంబర్ గా కూడా పేరు దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తోపాటు ఫ్యామిలీ అభిమానిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. అప్పట్లో చిరంజీవి (Chiranjeevi) స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీ పబ్లిసిటీ కోర్డినేషన్ బాధ్యతలను కూడా నిర్వర్తించారు బన్నీ వాసు. ఆ తర్వాత జనసేన పార్టీ (Janasena party) ప్రారంభం నుంచి కూడా కీలకపాత్ర పోషించిన ఆయన, అటు మెగా ఫ్యామిలీతో కూడా మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఇకపోతే అల్లు ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉండే బన్నీ వాసు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన లో కీలక పదవిలో నియమితులైనట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జరిగే ఆవిర్భావ సభ కార్యక్రమానికి ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికలలో బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొదటి జనసేన ఆవిర్భావ సభ కావడంతో అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల చూపు దీనిపైనే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతటి కీలకమైన సభకు సంబంధించిన బాధ్యతను బన్నీ వాసుకి అప్పగించడంతో అల్లు వర్సెస్ మెగా అన్న రూమర్స్ కి కాస్త చెక్ పడిందని చెప్పవచ్చు. రీసెంట్ గా ‘లైలా’ సినిమా ఫంక్షన్ లో చిరంజీవి.. అల్లు అర్జున్ తో పాటు ‘పుష్ప’ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు బన్నీ వాసుకి జనసేన సభకు బాధ్యతలు అప్పగించడంతో గత కొన్ని రోజులుగా మెగా – అల్లు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అంటూ ప్రచారం అవుతున్న గాసిప్స్ కి చెక్ పెట్టినట్లు అనిపిస్తోంది. కానీ మరోవైపు ఇక మెగా – అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని రెండు ఫ్యామిలీల మధ్య బన్నీ వాసు నలుగుతున్నారని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా అల్లు , మెగా కుటుంబాలకు అత్యంత సన్నిహితుడిగా మారిన బన్నీ వాసుకి.. ఇప్పుడు జనసేనాని ఈ కీలక బాధ్యతను అప్పగించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Chhaava in Telugu : తెలుగులోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ ఛావా… రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
బన్నీ వాసు కెరియర్..
బన్నీవాసు విషయానికి వస్తే.. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, చావు కబురు చల్లగా, భలే భలే మగాడివోయ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈయన మాస్టర్ ఇన్ ఐటి కోర్స్ నుండి తప్పుకొని పెంటా సాఫ్ట్ వద్ద 3డి అనిమేషన్ నేర్చుకున్నారు . జానీ చిత్రం యొక్క లోగో అనిమేషన్ కోసం అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ దగ్గర చేరి, ఆ తర్వాత గీత ఆర్ట్స్ లో శిక్షకునిగా చేరారు. యు వీ క్రియేషన్స్ అధినేత వంశీతో కలిసి 57 చిత్రాలను గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో పంపిణీ చేసిన ఈయన, చివరిగా ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని కూడా పంపిణీ చేశారు. ఇక జనసేన పార్టీ లో చేరి జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా కూడా నియమించబడ్డారు.