Janhvi Kapoor : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం NTR 30 త్వరలోనే ప్రారంభం కానుందంటూ మేకర్స్ అప్‌డేట్ ఇచ్చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ సహా రత్నవేలు, సాబు సిరిల్ వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ చిత్రంలో పార్ట్ అయ్యారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి. మరి మూవీలో తారక్ సరసన హీరోయిన్‌గా నటించబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న విషయం. నిజానికి ముందు ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించాల్సింది. కానీ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం కావటంతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. మరిప్పుడు యంగ్ టైగర్ సరసన ఏ బ్యూటీ నటించనుందనే దానిపై పలు రకాలైన వార్తలు వినిపించాయి.
తాజా సమాచారం మేరకు NTR 30లో ఎన్టీఆర్‌కి జోడీగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించనుందట. రీసెంట్‌గా జరిగిన బాలీవుడ్ చిత్రం ‘మిలి’ ప్రెస్ మీట్‌లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తాను సౌత్ సినిమాలో నటించటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, త్వరలోనే సౌత్ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలియజేసింది. ఆమె అలా అనటంతో NTR 30లో జాన్వీ నటిస్తుందనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.