BigTV English

Janhvi Kapoor:- రాజ‌మౌళి సినిమాలో ఆమె చేయ‌టం లేదా?

Janhvi Kapoor:- రాజ‌మౌళి సినిమాలో ఆమె చేయ‌టం లేదా?

Janhvi Kapoor:- ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఆయ‌న‌తో సినిమా చేయ‌టానికి స్టార్ హీరోలంద‌రూ రెడీగా ఉంటార‌న‌టంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న చేయ‌బోతున్న సినిమా ఓ ఫారెస్ట్ అడ్వెంచ‌ర‌స్ మూవీ. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇందులో హీరో అని అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ‌ను త‌యారు చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. కాగా.. ఇటీవ‌ల ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టించ‌నుందంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈమె ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.


అయితే ఈ వార్త‌ల‌న్నంటినీ జాన్వీ క‌పూర్ స‌న్నిహిత వ‌ర్గాలు కొట్టిపారేశాయి. మ‌హేష్, రాజ‌మౌళి చిత్రం జాన్వీ క‌పూర్ చేయ‌టం లేదని స‌మాచారం. రాజ‌మౌళి ఈ సినిమాను ట్ర‌యాల‌జీగా రూపొందించ‌బోతున్నార‌నే వార్త‌లైతే వినిపిస్తున్నాయి. అంటే SSMB 29 మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. అందుక‌నే రాజ‌మౌళి ప్ర‌ముఖ హాలీవుడ్ సంస్థ‌ల‌న్నింటితో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అందుకు కార‌ణం.. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ ఎక్కువ సంఖ్య‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను జక్క‌న్న తెర‌కెక్కించ‌నున్నారు.

RRR త‌ర్వాత రాజ‌మౌళి చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. రాజ‌మౌళి సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా రావ‌టం ఇప్పుడు యావ‌త్ సినీ ప్ర‌పంచం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సినిమాను లాంచనంగా ప్రారంభించి వ‌చ్చే ఏడాది రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెడ‌తార‌ని టాక్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ కూడా త్రివిక్ర‌మ్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. SSMB 29 నటీనటులతో పాటు ఎలాంటి టెక్నీషియన్స్ వర్క్ చేయబోతారనేది కూడా ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని విపరీతగా పెంచేస్తోంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×