BigTV English

Sai Dharam Tej:- పెళ్లిపై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

Sai Dharam Tej:- పెళ్లిపై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

Sai Dharam Tej:- టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్‌లో ఒక‌రు సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. కెరీర్ మంచి ఊపు మీదున్న ద‌శ‌లో ఆయ‌న‌కు యాక్సిడెంట్ అయ్యింది. మాట ప‌డిపోయింది. అంద‌రూ భ‌య‌ప‌డుతున్న త‌రుణంలో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు సాయిధ‌ర‌మ్‌. ఇప్పుడు విరూపాక్ష అనే పాన్ ఇండియా సినిమాతో ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారీ మెగా క్యాంప్ హీరో. ఇది ఏప్రిల్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ త‌రుణంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న పెళ్లి గురించి సాయిధ‌ర‌మ్ తేజ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.


పెళ్లి చేసుకోరా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ యంగ్ హీరో స్పందిస్తూ ‘‘నాకు అన్నీ సెట్ అయ్యిందని అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు పెళ్లి చేసుకోను’’ అన్నారు. మరి బ్రేకప్ లాంటిదేమైనా జరిగిందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ ‘‘అవును బ్రేకప్ చాలా పెద్దగానే అయ్యింది. దాంతో చాలా సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు అమ్మాయిలంటేనే భయమేస్తుందని ’’ అన్నారు. అయితే ఆ బ్రేకప్ ఎవరితో జరిగిందనేది మాత్రం సాయితేజ్ చెప్పలేదు. లారిస్సా బోనిసాతో సాయిధ‌ర‌మ్ ల‌వ్ ట్రాక్ న‌డిపిన‌ట్లు గ‌తంలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. అలాగే సినీ ఇండస్ట్రీలో తన ఫ్యామిలీ తప్ప.. బయట వారిలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పారు మన మెగా క్యాంప్ హీరో.

ఇక విరూపాక్ష సినిమా విష‌యానికి వ‌స్తే సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించ‌టంతో పాటు బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌తో క‌లిసి సినిమా నిర్మాణంలో భాగ‌మ‌య్యారు. సంయుక్తా మీన‌న్ ఇందులో హీరోయిన్‌. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌కి చాలా మంచి టాక్ వచ్చింది. ఈ సినిమా హిట్టయితే సాయిధరమ్ కూడా పాన్ ఇండియా హీరోగా మారినట్లే అని సినీ సర్కిల్స్ టాక్.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×