BigTV English

Janvi Kapoor : ‘పుష్ప 2’ పై విమర్శలకు కౌంటర్… వాళ్ళందరికీ గడ్డి పెట్టిన జాన్వీ

Janvi Kapoor : ‘పుష్ప 2’ పై విమర్శలకు కౌంటర్… వాళ్ళందరికీ గడ్డి పెట్టిన జాన్వీ

Janvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ సౌత్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ, అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాపై వెల్లువెత్తుతున్న విమర్శలకు తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.


‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఓవైపు ఈ సినిమాపై తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది ‘పుష్ప 2’ (Pushpa 2). ముఖ్యంగా కలెక్షన్ల పరంగా మాస్ జాతర చూపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టి, పుష్పరాజ్ సత్తా ఏంటో నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించడంపై నార్త్ లో విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ రిలీజ్ కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ‘ఇంటర్ స్టెల్లార్’ రీరిలీజ్ వాయిదా పడింది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు. దీంతో తాజాగా ఈ వివాదంపై జాన్వి కపూర్ స్పందిస్తూ, అలా కామెంట్స్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ఓ మీమ్ కు రిప్లై ఇస్తూ పుష్ప రాజ్ కి సపోర్ట్ గా నిలిచింది. “ఇది కూడా సినిమానే కదా. ఎందుకు ఓ సినిమాను మరో సినిమాతో పోల్చి తక్కువ చేస్తారు? ఏ హాలీవుడ్ సినిమాను మీరు సపోర్ట్ చేస్తున్నారో… అదే హాలీవుడ్ కు చెందినవారు మన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం ఇంకా మన సినిమాలను తక్కువ చేస్తూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. ఇలాంటివి చూసినప్పుడే బాధగా అనిపిస్తుంది” అంటూ రాసుచ్చింది. దీంతో ‘పుష్ప 2’ (Pushpa 2) కు జాన్వి కపూర్ సపోర్ట్ ఇవ్వడం చూసి తెలుగు ప్రేక్షకులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.


క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో రూపొందిన అద్భుతమైన సినిమాల్లో ‘ఇంటర్‌ స్టెల్లార్‌’ కూడా ఉంటుంది. ఈ సినిమా 2014లోనే రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయ్యి పదేళ్లయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం అన్ని ఐమాక్స్ లలో ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీనే ఉండడంతో ఈ సినిమా రీరిలీజ్ ని వాయిదా వేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొంతమంది ‘పుష్ప 2’ (Pushpa 2) పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు ‘దేవర’ (Devara) సినిమాతో జాన్వి కపూర్ తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ‘ఆర్సి 16’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

ఇక ‘పుష్ప 2’ (Pushpa 2) విషయానికొస్తే… సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule) లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక మందన్న, పోలీసు అధికారి భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×