Janvikapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి నటిగా aఅందరి మన్ననలు అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన అనతి కాలంలో నే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. ఒకవైపు వరుస మరో వైపు వాణిజ్య ప్రకటనలు చేసింది. ఇక అదే జోష్ లో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీ లో నటించింది. ఆ మూవీలో తక్కువ సమయంలో కనిపించిన మొదటి సినిమా కావడంతో ఎక్కువ మంది జాన్వీ అందాలకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తెలుగులో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే జాన్వీ గురించి నెట్టింట ఎప్పుడు ఏదొక రూమర్ వినిపిస్తుంది. తాజాగా డైరెక్టర్ కోసం 3 రోజులు చాలా కష్ట పడిందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కాపుర్ మూడు రోజులు, మూడు రాత్రులు అలాంటి పని చేసిందంటూ ఓ వార్త షికారు చేస్తుంది.. అసలు మ్యాటర్ ఏంటంటే.. డైరెక్టర్ కోసం మూడు రాత్రులు అంటే అందరూ ఏదేదో ఊహించేసుకుంటారు.ఎందుకంటే మూడు రాత్రులు అంటే పెళ్లి తర్వాత మూడు రాత్రులే అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.. ఆమె మూడు రోజులుగా రాత్రులు చేసిన పని గురించి తప్పుగా అనుకోవద్దు. అసలు జాన్వీ చెప్పింది వేరే..
అసలు మ్యాటర్లోకి వెళితే.. జాన్వీ కపూర్ నటించిన రూహీ మూవీ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది జాన్వీ కపూర్. ఇందులోని ఒక పాటలో నేనొక్కదాన్నే పెర్ఫార్మన్స్ చెయ్యాలి. అయితే కఠినమైన లైటింగ్ కింద చిన్న వయసు లో ఉన్న నేను డాన్స్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. సోలోగా చెయ్యడం నాకు కొత్త. మొదట్లో బాగా ఇబ్బంది పడ్డాను ఆ తరువాత డైరెక్టర్ చెయ్యమంటే చేసానని ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఈ విషయాన్ని బయట పెట్టింది. రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ ఒక రాత్రి 7 గంటలు పూర్తిగా నిద్రపోకుండానే వర్క్ చేసి మళ్లీ మరో సినిమా షూటింగ్లో పాల్గొన్నాను.అలాగే రూహి సినిమాలోని పాట కోసం ఏకంగా మూడు రాత్రులు రిహర్సిల్స్ చేసాను. రాత్రంతా షూటింగ్ కోసమే కష్టపడ్డాను అని చెప్పింది.
ఇక ఈమె సినిమాల విషయానికొస్తే.. దేవర మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది.. మొదటి సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ మూవీ చేస్తుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే ఈ మూవీ గురించి క్లారిటీ రావాల్సి ఉంది .