OTT Movie : రొమాంటిక్ సినిమాలనే కాదు రొమాంటిక్ కథలను కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. రొమాంటిక్ నవలలను చదువుతూ కొంతమంది మరో లోకంలో విహరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక రచయిత్రి రాసిన నవలలో అసభ్యత ఎక్కువగా ఉందని కొంత మంది కోర్టుకు వెళ్తారు. ఆ తర్వాత జరిగే స్టోరీ మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘లిహాఫ్’ (Lihaaf). 2019 లో వచ్చిన ఈ మూవీకి రిహాత్ కాజ్మీ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ తన కథలో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ, కొంతమంది ఆమెపై కోర్టుకు వెళతారు. అయితే ఆమె తనను తాను సమర్థించుకుని, ఆరోపణలను ఖండిస్తూ కథను వివరిస్తూనే ఉంటుంది. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఇస్మత్ అనే మహిళ నవలలు రాస్తూ ఉంటుంది. ఈమె రచయిత్రి గా మంచి పేరు తెచ్చుకుంటుంది. అయితే ఆమె రాసిన ఒక నవలలో అసభ్యత ఎక్కువగా ఉందని కొంతమంది కోర్టుకు వెళ్తారు. ఇస్మత్ రాసిన నవల ఏమిటంటే.. ఒక నవాబ్ కి బేగంజాన్ తో పెళ్లి జరుగుతుంది. నవాబ్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెను టచ్ కూడా చేయడు. బేగంజాన్ కోరికలతో రగిలిపోతూ ఉంటుంది. ఎన్నిరోజులైనా తన దగ్గరికి రాకపోవడంతో,నవాబు ఒక గే అనే విషయం తెలుసుకుని బాధపడుతుంది. అప్పుడు అక్కడే ఉన్న పనిమనిషి బేగంజాన్ని ఓదారుస్తుంది. అలా వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు దగ్గరవుతూ ఇంటిమేట్ కూడా అవుతుంటారు. నవాబ్ స్వలింగ సంపర్కుడు కావడంతో, ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుంటూ ఉంటాడు. వాళ్లతో తన కోరికలు తీర్చుకుంటాడు. పెళ్లి పేరుకు మాత్రమే చేసుకుంటాడు నవాబు.
నవాబుకు ఆమె ఇలా చేస్తుందని తెలిసినా, అతడు కూడా గే కావడంతో ఏమీ అనలేకపోతాడు. అయితే పనిమనిషి కొన్ని రోజులు రాకపోవడంతో, అక్కడే చిన్న వయసులో ఉన్న ఇస్మత్ ని దగ్గరికి పిలుస్తుంది బేగంజాన్. ఆమె ముందే బట్టలు కూడా మార్చుకుంటూ, తనతో కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది. ఇది చూసి భయపడి బయటకు వచ్చేస్తుంది ఇస్మత్. ఇలా తన చిన్న వయసులో జరిగిన స్టోరీని, నవలగా రాసి వివాదానికి కారణం అవుతుంది. చివరికి కోర్టులో ఆమెకు ఎదురు దెబ్బ తగులుతుందా? బేగంజాన్ ఇస్మత్ కూడా ఇంటిమేట్ అవుతుందా? ఇస్మత్ వయసులో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లిహాఫ్’ (Lihaaf) అనే ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. మీరు ఈ మూవీని ఒంటరిగా చూడటమే మంచిది.