BigTV English

Jani Master: కన్నబిడ్డలను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన జానీ మాస్టర్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Jani Master: కన్నబిడ్డలను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన జానీ మాస్టర్.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 37 రోజుల జైలు జీవితం తరువాత బెయిల్ పై  బయటకు వచ్చిన విషయం తెల్సిందే. డ్యాన్సర్ ను లైంగికంగా  వేధించిన కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్ళాడు. గత కొన్నేళ్లుగా తనను జానీ మాస్టర్ వేధిస్తున్నాడని,  మతం మార్చుకోమని టార్చర్ పెడుతున్నాడని సదురు డ్యాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మధ్యలో జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేయడానికి ప్రయత్నించగా.. మొదటిసారి ఆయనే తనకు బెయిల్ వద్దని చెప్పడంతో బెయిల్ రాలేదు. ఇక రెండో సారి జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు రావడంతో.. బెయిల్ కు అప్లై చేయగా.. కోర్టు నిరాకరించింది. ముచ్చటగా మూడసారి బెయిల్ కు అప్లై చేయగా.. అక్టోబర్ 25 న జానీ మాస్టర్ బయటకు వచ్చాడు.


జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్ .. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. మొదట తాను కొరియోగ్రఫీ చేసిన హిందీ సాంగ్ హరే రామ్ హరే రామ్ రికార్డులు సృష్టిస్తుండడంతో.. ఆ సాంగ్ మేకింగ్ వీడియోను  షేర్ చేసి అభిమానులకు థాంక్స్ చెప్పాడు. ఇక నేటి ఉదయం.. జైలు జీవితం ఎంత నరకమో తెలుపుతూ ఒక వీడియో షేర్ చేశాడు.

Devara: సోషల్ మీడియాను షేక్ చేసిన చుట్టమల్లే వీడియో సాంగ్.. వచ్చేసింది


” ఇంకా నాకు జైల్లో ఉన్నట్టే అనిపిస్తోంది. అసలు ఆ ఫుడ్డు తినలేకపోయాను. మనిషి అనే వాడు జీవితంలో జైలుకు వెళ్ళవద్దు. బయట కంటే జైల్లో చాలా నరకం ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు. రెండు రోజులు గడిస్తే తప్ప నేను సాధారణ స్థితికి వస్తానని అనిపించట్లేదు. ఇప్పట్లో మీడియా ముందుకు రాలేను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా జానీ మాస్టర్ మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో జైలు నుంచి ఇంటికి రాగానే కన్నబిడ్డలు తండ్రిని పట్టుకొని భోరున విలపించిన దృశ్యాలు ఇందులో కనిపించాయి. జానీ మాస్టర్ తలుపు తెరవగానే ఆయన కొడుకు.. తండ్రిని గట్టిగా పట్టుకొని  విలపించాడు. అస్సలు వదలకుండా కంటనీరు పెట్టుకున్నాడు. కొడుకు ఏడవడం చూసి జానీ మాస్టర్ కూడా కంటనీరు పెట్టుకున్నాడు. ఇక తండ్రిని చూసి కూతురు కూడా తన ప్రేమను చూపించింది. ఇద్దరు బిడ్డలను హత్తుకొని జానీ మాస్టర్ ఏడుస్తున్న దృశ్యాలు.. చూసేవారి హృదయం కూడా ద్రవింపజేసేలా ఉన్నాయి.

Bigg Boss Telugu 8: అతన్నీ కలవడం కోసం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానన్న హాట్ బ్యూటీ..

అంతేకాకుండా తండ్రి లేని ఈ  37 రోజులు కూతురు..  తండ్రిని తలుచుకొని పేపర్ పై బొమ్మలు గీసినట్లు తెలుస్తోంది. వాటిని కూడా తండ్రికి చూపించి ప్రేమను కురిపించింది. ఇక ఎలాంటి కష్టం వచ్చినా పక్కన ఉన్న భార్యను కూడా జానీ మాస్టర్ హత్తుకొని ఏడ్చాడు. ఈ వీడియోకు క్యాప్షన్ గా.. “ఈ 37 రోజులలో మా నుంచి చాలా తీసేశారు. నా కుటుంబం మరియు శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఈరోజు ఇక్కడకు చేర్చాయి. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కానీ, ఎన్నోరోజులు దాగదు. అది ఒక రోజు ప్రబలంగా ఉంటుంది. ఇన్నిరోజులు నా కుటుంబం పడిన ఈ బాధ.. నేను బతికున్నంతవరకు గుచ్చుతూనే  ఉంటుంది” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×