Jani master.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ (Jani master) అనూహ్యంగా లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి, ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. అయితే ఆయన కేసు నుండి బయటకు వచ్చి గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరొక సినిమాలో అవకాశం రాగా.. ఆ సినిమా కోసం మళ్లీ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన స్టూడియోలో డాన్స్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ గా మారగా.. సడన్ ట్విస్ట్ ఇచ్చింది శ్రేష్టి వర్మ (Shrasti Verma). ఇన్ని రోజులు మీడియా ముందుకు రాని శ్రేష్టి వర్మ సడన్ గా ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ గురించి సంచలన కామెంట్లు చేసింది. దీంతో మళ్ళీ జానీ మాస్టర్ వార్తల్లో నిలిచారు.
శ్రేష్ఠి వర్మ పై ఆయేషా కామెంట్స్.
దీనికి తోడు ప్రముఖ ఝాన్సీ కూడా జానీ మాస్టర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడంతో.. జానీ మాస్టర్ కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కి రీకౌంటర్ ఇస్తూ.. శ్రేష్టి వర్మ మళ్ళీ పోస్ట్ చేసింది. ఇక ఇలా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ లైఫ్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈయన భార్య ఆయేషా (Ayesha) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రేష్ఠి వర్మపై షాకింగ్ కామెంట్లు చేసింది. శ్రేష్టి వర్మ మాట్లాడుతూ.. “నా భర్త జానీ మాస్టర్ పై ఆ మహిళ కొరియోగ్రాఫర్ మనసు పారేసుకుంది. అందుకే ఆ మహిళను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తీసేసాము. ఒకవేళ జానీ మాస్టర్ ఆమెపై ఆరేళ్లుగా లైంగిక దాడికి పాల్పడితే, ఆమె ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేయడం ఏమిటి? ఆ మహిళ చెల్లి చదువు కోసం కూడా మేము ఎంతో సహాయం చేసాము. ఆమెకు డాన్స్ అసోసియేషన్ సభ్యత్వం కూడా ఇప్పించింది మేమే”.. అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది ఆయేషా.
లైంగిక వేధింపుల కేసులు బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్..
ఇదిలా ఉండగా పోలీసులు మళ్లీ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఇచ్చారు. లైంగిక వేధింపుల కేసులో మరొకసారి కదలికలు మొదలయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా గతంలో ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆమెపై లైంగిక దాడులు చేసినట్టు సమాచారం. దీంతో అంతా ముగిసిపోయింది అనుకున్న సమయంలోనే జానీ మాస్టర్ కి కొత్త తలనొప్పి మొదలైంది. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై కేసు నమోదు అవ్వగా… 36 రోజులపాటు చంచల్గూడా జైల్లోనే ఉన్నారు. దీంతో ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దయింది. ఎట్టకేలకు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు మళ్లీ జానీ మాస్టర్ కు కొత్త చిక్కులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.