Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. 1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే భద్రతా కారణాల దృశ్య టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. భారత్ తనకు సంబంధించిన మ్యాచ్ లు అన్నింటిని దుబాయ్ వేదికగానే ఆడుతుంది. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి చాలా రోజుల సమయం లేదు. ఈ మెగా ఈవెంట్ లో 8 టీమ్ లు పాల్గొనబోతున్నాయి.
ఈ టోర్నీ ప్రారంభం కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఈ టోర్నీ ప్రారంభ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ఈవెంట్ కి ముందు భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ {Rohit Sharma} పాకిస్తాన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్ కి ముందు.. టోర్నీ లో పాల్గొనే జట్ల కెప్టెన్లు అందరూ ఫోటోషూట్ { photoshoot} కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది.
అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తారు. టోర్నమెంట్ ని అధికారికంగా నిర్వహించే దేశంలో ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు జరిగే కెప్టెన్ ఫోటోషూట్ { photoshoot} ని పిసిబి రద్దు చేసింది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ సీజన్ జోరుగా సాగడం వల్లే ఈ ప్రీటోర్ని ఈవెంట్ ని రద్దు చేయాల్సి వచ్చిందని ఓ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు.
అయితే ఓపెనింగ్ సెర్మని మాత్రం ఫిబ్రవరి 16న లాహోర్ లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ {Rohit Sharma} కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ సమావేశం కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. ఇక ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు టి-20 ల సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ జరగబోతోంది.
Also Read: IND vs ENG 4th T20I: నేడే 4వ టీ20… రింకూ, అర్షదీప్ రీ-ఎంట్రీ..షమీ ఔట్!
ఆ తర్వాత భారత జట్టు ఫిబ్రవరి 15న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం దుబాయ్ లో అడుగు పెట్టబోతోంది. ఈ టోర్నీలో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ని ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో ఆడబోతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు కెప్టెన్ల ఫోటోషూట్ రద్దు అయ్యిందన్న వార్తతో అభిమానులు కొంతవరకు సంతోషిస్తున్నారు.
🚨 NO OPENING CEREMONY FOR CT. 🚨
– Rohit Sharma will stay in Dubai as PCB and ICC have cancelled their planned opening ceremony or captain's photoshoot. (Cricbuzz). pic.twitter.com/mD2LE552uu
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2025