BigTV English

OG Movie: ఓజీలో జపాన్ నటుడు. ఏం ప్లాన్ చేసావ్ సుజీత్ మావా.. ?

OG Movie: ఓజీలో జపాన్ నటుడు. ఏం ప్లాన్ చేసావ్ సుజీత్ మావా.. ?

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను ముగించే పనిలో పడ్డాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ని ఫినిష్ చేసిన పవన్.. ఎట్టకేలకు తన రెండో సినిమా ఓజీని కూడా ఫినిష్ చేశాడు. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక  ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా..  బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఆయనతోపాటు కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీయ రెడ్డి కీలకపాత్రలో నటిస్తున్నారు.


 

ఇప్పటికే ఓజీ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్  ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తించింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చివరకు  సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మొదటి నుంచి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే పేరును జపనీస్ భాషలోనే రిలీజ్ చేయడంతో జపాన్ కు ఈ కథకు సంబంధం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. సుజీత్ ప్రతిసారి ఏ అప్డేట్ ఇచ్చినా.. అందులో ఎక్కడో ఒక చోట జపనీస్ భాష కనిపిస్తూనే ఉంది.


 

ఇక తాజాగా ఈ  సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.  ఈ సినిమాలో ఒక జపాన్ నటుడు నటిస్తున్నాడు అని తెలుస్తుంది. కియిచి అండో అనే జపాన్ మోడల్ ఈ సినిమాలో కీలక పాత్రలోనటిస్తున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పడం విశేషం.  తాజాగా ఈ నటుడు ఓజీ సినిమా పోస్టర్ ను  తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూ  ఓజీ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో కియిచి ఈ సినిమాలో నటిస్తున్నాడని కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

 

జపాన్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.  ఏం ప్లాన్ చేశావు సుజీత్ మావా.. ? ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడు అంటూ నెటిజన్స్  కామెంట్స్ పెడుతున్నారు. మొదటి నుంచి  కూడా ఓజీ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. చాలా రీమేక్స్  తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి కొత్త కథతో రాబోతున్నాడు. అన్నింటి కన్నా ముందు ఈ సినిమాను ఫినిష్ చేయడానికే పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సాహో తరువాత సుజీత్ చాలా గ్యాప్ తీసుకొని, పవన్ కోసం ఎదురుచూసి ఎంతో ఓపికగా తీసిన సినిమా ఓజీ. గతేడాదిలోనే రిలీజ్ కావాల్సిన  సినిమా ఇప్పటికీ రిలీజ్ కు రెడీ అవుతుంది.  మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు సుజీత్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×