Walnuts Benefits: వాల్ నట్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు ,కార్బోహైడ్రేట్లు అన్నీ వాల్‌నట్స్‌లో సమతుల్య పరిమాణంలో లభిస్తాయి. ప్రోటీన్‌తో పాటు, వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ , సెలీనియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి.
అంతే కాకుండా ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరాన్ని ఉబ్బసం, ఆర్థరైటిస్, తామర , సోరియాసిస్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది. వీటిని సూప్, చాక్లెట్, కుకీస్, లడ్డూలు, మిల్క్ షేక్స్, జామ్‌లు మొదలైన వాటి తయారీలో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ (చలికాలంలో మాత్రమే) తేనెతో రెండు వాల్ నట్స్ కలిపి తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని డాక్టర్లు చెబుతుంటారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రతి రోజూ 25 గ్రాముల వాల్‌నట్స్ తినడం వల్ల మెదడు రిఫ్రెష్ అవుతుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
2. వాల్ నట్స్ తినడానికి చలికాలం మంచి సీజన్. ఎందుకంటే చల్లని వాతావరణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా శరీరం దాని పోషక లక్షణాలను ఎక్కువగా పొందుతుంది.
3. రోజూ 25 గ్రాముల వాల్‌నట్స్ గింజలను ఆహారంతో పాటు తినడం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది.
దీంతో పాటు గుండె కూడా సురక్షితంగా ఉంటుంది.
4. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. అది దానిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో ఉండే కొవ్వు , పోషకాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
5. వాల్‌నట్స్‌లో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది.వాల్ నట్స్ అతిగా తినకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా ఇది మీ శరీర బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్
మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలను తొలగిస్తుంది.
6. ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎముకల బలోపేతం కోసం కూడా ఉపయోగపడుతుంది.
7. వాల్‌నట్స్ ఆకుల నుండి తయారుచేసిన కషాయం రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్త నాళాల విస్తరణకు ఇది ఉత్తమమైన ఆహారం. కాబట్టి గుండె రోగులకు ఇది ఒక వరం అని చెప్పవచ్చు.
8. ప్రతి రోజూ 5 గ్రాముల వాల్‌నట్స్ గింజలను ఎండుద్రాక్షతో కలిపి తినడం వల్ల
శరీరంలో శక్తి, బలం పెరుగుతుంది.
9. జలుబు వల్ల వచ్చే దగ్గుకు కాల్చిన వాల్‌నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.
10. వాల్‌నట్స్ తో తయారు చేసిన ఆయిల్ జుట్టును పొడవుగా, మందంగా , నల్లగా చేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా , మృదువుగా కూడా చేస్తుంది. అంతే కాకుండా ఈ నూనె మృత కణాలను, నల్లటి మచ్చలను ,ముడతలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని మాయిశ్చరైజింగ్ గుణం చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.
11. వాల్‌నట్స్‌లో యాంటీ-ఆక్సిడెంట్ సమ్మేళనాలు చాలా ఉన్నాయి కాబట్టి, వాటిని క్యాన్సర్ నిరోధక ఆహారం అని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల ప్రోస్టేట్ , రొమ్ము వంటి అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
12. వాల్‌నట్స్‌లో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉండటం వల్ల నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి నిద్ర వస్తుంది.
Also Read: తగినంత నిద్ర పోకపోతే.. ఎంత ప్రమాదమో తెలుసా ?
వాల్‌నట్స్ ఎలా తినాలి ?
వాల్‌నట్స్ డ్రింక్స్ కూడా తయారు చేసి త్రాగవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే..
కావలసినవి:
ఒక చెంచా- నెయ్యి
7 – నల్ల మిరియాలు
4- వాల్‌నట్స్
10- గోధుమ గింజలు
2 – బాదం
5- ఎండుద్రాక్ష
2- చిన్న ఏలకులు
1 కప్పు- పాలు, నీరు
తగినంత- చక్కెర
తయారీ విధానం: ముందుగా ఎండుద్రాక్ష, గోధుమ గింజలు, నల్ల మిరియాలు, వాల్‌నట్స్, బాదం మొదలైన వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఎండుద్రాక్ష నుండి విత్తనాలను తీసి మిక్సీ పట్టాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు పాలు, 1 కప్పు నీరు వేసి, నెయ్యి వేసి మరిగించాలి. దీనికి చిన్న ఏలకులు, చక్కెర మొదలైనవి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి 1-2 సార్లు బాగా మరిగించాలి. ఇది చాలా మంచి, ప్రయోజనకరమైన ఎనర్జీ డ్రింక్.