Producer Chitti Babu: ఇండస్ట్రీలో ఏ వివాదం జరిగినా.. దానిపై స్పందించే వ్యక్తుల్లో నిర్మాత చిట్టిబాబు ముందు ఉంటాడు. అది ఎలాంటి వివాదం అయినా కానీ, దాని మీద తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. చిట్టిబాబు చెప్పింది నిజామా.. ? కాదా.. ? అనే విషయం పక్కన పెడితే.. వెంటనే స్పందిస్తూ తన అభిప్రాయం చెప్పడం మంచి విషయమని కొందరు అంటారు.. పబ్లిసిటీ కోసం చేస్తున్నాడని ఇంకొందరు అంటారు.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న త్రినాథరావు నక్కిన వ్యాఖ్యలపై చిట్టిబాబు స్పందించాడు. ఒక హీరోయిన్ గురించి స్టేజిపై అంత నీచంగా మాట్లాడం నెటిజన్స్ కు నచ్చలేదు. అసలేమైందంటే.. త్రినాథరావు నక్కిన తాజాగా మజాకా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో మన్మథుడు బ్యూటీ అన్షు అంబానీ రీఎంట్రీ ఇస్తుంది. ఆమె అందాన్ని పొగిడినంతవరకు పొగిడి.. చివర్లో సైజ్ ల గురించి మాట్లాడాడు.
” అన్షు కొంచెం సన్నబడింది. నేనే కొద్దిగా తిని పెంచమ్మా.. తెలుగుకు సరిపోదు. అన్ని కొంచెం ఎక్కువ సైజ్ లలో ఉండాలి” అని మాట్లాడాడు. ఇక ఈ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ సైతం ఫైర్ అయ్యింది. నోటీసులు కూడా పంపిస్తామని చెప్పడంతో తగ్గినా డైరెక్టర్ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఈ ఘటనపై చిట్టిబాబు మాట్లాడుతూ.. ” ఇది మాములుగా జరిగేదే. ఏ హీరోయిన్ను అయినా డైరెక్టర్ అనేవాడు.. కెమెరాలో ఎలా కనిపిస్తుంది అనేది చూసుకుంటాడు. బయట లావుగా ఉన్నవాళ్లు కూడా కెమెరాలో సన్నగా కనిపిస్తారు. డైరెక్టర్స్.. హీరోయిన్స్ ను అడుగుతారు. తన పాత్రకు ఎలా ఉండాలో చెప్తారు.
Manchu Family: ఆస్తి తగాదాలు.. ఎలా ఉండే కుటుంబం.. ఎలా అయిపోయిందిరా
నా సినిమాకు కొద్దిగా లావు అవ్వాలి అని అంటారు. త్రినాథరావు కూడా అలాంటి ఉద్దేశ్యంతోనే అన్నాడు. కొంచెం తిని కండ పెంచు, పుష్టిగా ఉండు అనే ఉద్దేశ్యంతో అనాలనుకున్నాడు. అది చెప్పడంలో సైజ్ లు అని పిచ్చిమాటలు అనడంలో తేడా వచ్చింది. హీరోయిన్నీ బక్కపలచగా ఉన్నావు.. కొంచెం కండ పెంచు.. కెమెరాలో కనిపిస్తావు అని అనడం మాములే. చాలామంది డైరెక్టర్స్ హీరోయిన్స్ ను తగ్గమంటారు.. పెరగమంటారు.
ఒక సినిమా కోసం అనుష్క బరువు పెరగలేదా.. ? అయితే ఈ సైజులు అనడం వలన అది తేడాగా వినిపిస్తుంది. అప్పుడు ఒకలా ఉన్న ఆమె.. ఇప్పుడు మారడంతో అలా అన్నాడు. అతను అలా అనడంలో తప్పు లేదు. మంచి ఉద్దేశ్యంతోనే అన్నాడు. కానీ, ఆ వేరే మాటలు అనడంతో ఇదంతా వచ్చింది. అతను చేసింది తప్పే. పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అసలు ఏం మాట్లాడుతున్నాం.. ? ఏంటి అనేది చూసుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.