BigTV English

Jayasudha: ఆ హీరోయిన్ అంతలా అవమానించిందా.. ఏకంగా జుట్టు పట్టుకొని..!

Jayasudha: ఆ హీరోయిన్ అంతలా అవమానించిందా.. ఏకంగా జుట్టు పట్టుకొని..!

Jayasudha.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ (Jayasudha ) ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సహజ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, అచ్చ తెలుగు హీరోయిన్ గా సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే హీరోయిన్స్..జయసుధ, జయప్రద, శ్రీదేవి, జమున, విజయనిర్మల, అంజలి, కృష్ణవేణి, కృష్ణకుమారి, జయంతి , అంజలి.. నటనలో వీరంతా కూడా ఒక ఎత్తు అయితే మహానటి సావిత్రి మరో ఎత్తు అని చెప్పవచ్చు.


సహజ నటిగా భారీ గుర్తింపు..

ఇలా వీరంతా తెలుగు భూమిపై పుట్టి తమిళ్, కన్నడ, తెలుగు పరిశ్రమలను ఏలారు. ఆ తర్వాత రంభ, విజయశాంతి లాంటి వారు తెలుగు హీరోయిన్లుగా స్టార్ డంను పొందారు. ఇక సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ తన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ,శోభన్ బాబు, మోహన్ బాబు, మురళీమోహన్ ఇలా ఎంతోమంది హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా జయసుధ తో చాలామంది కో ఆర్టిస్టులు కూడా నటించేవారు. తోటి హీరోయిన్లు చాలా చక్కగా ఉండేవారు కానీ కొంతమందిలో మాత్రం కోల్డ్ వార్ నడిచేదట. మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం నేరుగానే గొడవలు పెట్టుకునే వారట.


హీరోయిన్ తో జుట్టు పట్టుకొని గొడవపడిన జయసుధ..

Jayasudha: Did that heroine insult me so much.. holding her hair together..!
Jayasudha: Did that heroine insult me so much.. holding her hair together..!

ఈ క్రమంలోనే ఒక సందర్భంలో ఒక హీరోయిన్ జయసుధతో గొడవ పడి కొట్టుకునే స్థాయికి వచ్చిందట. ఆ గొడవ పెద్దదయ్యి షూటింగ్లోనే ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారట. షూటింగ్లోనే ఇలా కొట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఆ సినిమా ఏదో కాదు కటకటాల రుద్రయ్య. ఆ హీరోయిన్ జయచిత్ర. ఈ విషయాన్ని స్వయంగా జయసుధ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జయసుధ మాట్లాడుతూ.. కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చెన్నైలోని బీచ్ లో జరుగుతోంది. అయితే అప్పుడు నేను హీల్స్ వేసుకున్నాను. అయితే జయచిత్ర పొట్టిగా ఉండడంతో నన్ను హీల్స్ తీయమని చెప్పింది. ఎందుకంటే ఆ సీన్ మేమిద్దరం కొట్టుకునే సీను. అప్పుడు నేను హీల్స్ తీసేసాను. అయితే ఎందుకో తెలియదు ఇద్దరి మధ్య మాట పెరిగింది. సినిమా కోసం సీన్ లో కొట్టుకోవాల్సింది కానీ జుట్టు పట్టుకొని నిజంగానే కొట్టుకోవడం మొదలుపెట్టాము. అందరూ సీన్ అనుకోని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు. దాంతో రెచ్చిపోయి మేము ఇంకా కొట్లాడుకున్నాము అంటూ తెలిపింది జయసుధ.

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీ..

అప్పుడు జరిగింది ఏది కూడా మనసులో పెట్టుకోలేదని, ఆ తర్వాత ఇద్దరం కలిసి పోయి మాట్లాడుకునే వారము అంటూ తెలిపింది జయసుధ. అలా అప్పుడు ఎందుకు జరిగిందో ఇప్పటికి తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే సహజనటిగా పలు చిత్రాలలో నటించి మెప్పిస్తున్న ఈమె హీరోయిన్ గా కెరియర్ ముగిసిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ దూసుకుపోతోంది.

Tags

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×