Mamitha Baiju..మమిత బైజు (Mamitha Baiju).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ప్రేమలు’ సినిమాతో ఒక్క నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.. ఈ నేపథ్యంలోనే పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాన్ని దక్కించుకోగా.. ఇప్పుడు ఏకంగా ఒక స్టార్ హీరోతోనే రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యింది. ఇక ఆ స్టార్ హీరో ఎవరు? వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూర్య (Suriya) .. అదేంటి ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సింది కానీ ఆగిపోయింది కదా.. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్లో సినిమా రాబోతోందా..? మరి ఈ కొత్త మూవీ డైరెక్టర్ ఎవరు..? ఏ భాషలో రాబోతోంది అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సూర్యతో జతకట్టనున్న మమిత బైజు..
ఇదిలా ఉండగా.. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉండగా తప్పుకున్నారు.. ఇప్పుడు మళ్లీ సూర్యతో జత కట్టడానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక త్వరలోనే మమిత బైజుకి డైరెక్టర్ స్క్రిప్ట్ వినిపించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తమిళ్ మూవీ లో ఛాన్స్ కోల్పోయిన ఈ జంట ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాతో ఒక్కటి కాబోతున్నారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక సూర్య విషయానికి వస్తే కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న అక్కడ పలు చిత్రాలు చేసి ఆ చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేస్తూ.. ఇక్కడ కూడా పాపులారిటీ అందుకున్నారు. ఇక నేరుగా తెలుగులో సినిమా చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సూర్య ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆ కోరికను తీర్చుకోబోతున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా అటు సూర్యకు ఇటు యంగ్ బ్యూటీ మమితకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఏదేమైనా ఈ విషయం తెలిసి అభిమానులు ఈమె అదృష్టం మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: Tamannaah : ప్చ్… వాళ్లు ఇంకా విడిపోలేదు… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చిన తమన్నా..!
ఆమె వల్లే.. ముందే వీరి కాంబోలో మూవీ మిస్..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రేమలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మమిత బైజు.. తమిళ దర్శకుడు బాల (Director Bala) దర్శకత్వంలో సూర్య హీరోగా ‘వణంగాన్’ అనే సినిమా మొదలుపెట్టారు. ఇందులో మమిత బైజును హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో.. బాల ఈమెపై చేయి చేసుకున్నాడని, దాంతో ఈమె సినిమా నుంచి బయటకు వచ్చిందని, అటు సూర్య కూడా బయటకు వచ్చారు అంటూ వార్తలు రాగా.. ఆ వార్తలపై మమిత స్పందించింది. ” బాలతో ‘వణంగాన్’ సినిమా కోసం ఏడాది పాటు పనిచేశాను. కానీ ఆయన చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి. నన్ను ఇబ్బంది పెట్టలేదు. ముఖ్యంగా ఆయన నాపై చేయి కూడా చేసుకోలేదు. కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్లే నేను సినిమా నుండి బయటకు వచ్చాను” అంటూ రూమర్స్ ను కొట్టి పారేసింది . ఇకపోతే వణంగాన్ సినిమా నుంచి మమిత బైజుతో పాటు సూర్య కూడా బయటకు రావడంతో.. దర్శకుడు బాల.. డైరెక్టర్ అరుణ్ విజయ్ (Arun Vijay) ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశారు.