BigTV English

Bhumi Pednekar: హీరోలకు ఇచ్చేదాంట్లో 5 శాతం రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు.. భూమి బోల్డ్ కామెంట్స్

Bhumi Pednekar: హీరోలకు ఇచ్చేదాంట్లో 5 శాతం రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు.. భూమి బోల్డ్ కామెంట్స్

Bhumi Pednekar: సినీ పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు ఎంత తేడా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తేడాల గురించి చాలామంది ఇండస్ట్రీ నిపుణులు ఇంతకు ముందు చాలాసార్లు ఓపెన్‌గా కామెంట్స్ కూడా చేశారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం పాటల వరకే పరిమితం అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలావరకు కమర్షియల్ సినిమాల్లో కూడా హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తున్నారు. అయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మార్పులు రావడం లేదు. ఇప్పటికే ఈ రెమ్యునరేషన్ తేడాల గురించి చాలామంది ఓపెన్‌గా మాట్లాడగా.. తాజాగా ఆ లిస్ట్‌లోకి బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ కూడా యాడ్ అయ్యింది.


బోల్డ్ కామెంట్స్

చాలామంది బాలీవుడ్ హీరోయిన్లలాగా కాకుండా చాలా డిఫరెంట్ డెబ్యూతో హీరోయిన్‌గా మారింది భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar). ‘ధమ్ లగా కే హైసా’ మూవీ కోసం ఎన్నో కేజీల బరువు పెరిగి కేవలం తన పర్ఫార్మెన్స్‌తోనే బీ టౌన్‌లో హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా చాలావరకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను, సోషల్ మెసేజ్ కథలను ఎంచుకుంటూ ఫ్యాన్ బేస్ పెంచుకుంది. తనకు ఇండస్ట్రీలో ఏదైనా నచ్చకపోతే ఓపెన్‌గా చెప్పడం భూమికి అలవాటు. అలాగే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తను.. హీరోహీరోయిన్లకు మధ్య ఉండే రెమ్యునరేషన్ తేడాల గురించి మాట్లాడింది. ఇంతకు ముందు ఇదే విషయంపై దీపికా పదుకొనె లాంటి స్టార్ హీరోయిన్లు కూడా స్పందించారు.


వేరే దారిలేక నటించాను

‘‘నాతో పాటు కెరీర్‌ను ప్రారంభించిన హీరో నాకంటే ఎక్కువగా రెమ్యునరేషన్ సంపాదిస్తున్నాడు. అదే హీరో సినిమాలో నటించడానికి తన రెమ్యునరేషన్‌లో కేవలం 5 శాతం మాత్రమే నాకు ఆఫర్ చేశారు. మేము ఒకే సినిమాలో నటిస్తున్నా కూడా తనకు నాకంటే 80 శాతం ఎక్కువ పారితోషికం లభించింది. కానీ నాకు వేరే దారి లేక ఆ సినిమా చేశాను. ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. బయట కూడా ఇదే జరుగుతుంది. ఒక ఆడ సీఈఓ కంటే మగ సీఈఓకే ఎక్కువ జీతం ఇస్తుంటారు’’ అని చెప్పుకొచ్చింది భూమి పెడ్నేకర్. ఇప్పటికే భూమితో కలిసి నటించిన చాలామంది హీరోలు భారీ రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తుండగా తను మాత్రం అక్కడే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: తన గురించి ఎవరు ఏమనుకున్నా అనవసరం.. రష్మికకు సపోర్ట్‌గా బాలీవుడ్ నటి కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్

ముందుగా వైఆర్ఎఫ్ లాంటి ప్రముఖ సంస్థలో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి పెడ్నేకర్.. క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా వ్యాఖ్యలు చేసింది. తను ఎప్పుడూ పర్సనల్‌గా క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ చేయలేదని బయటపెట్టింది. అలా అని అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదుర్కున్న హీరోయిన్లు లేకపోలేదు అని చెప్పుకొచ్చింది. ప్రతీ ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని, ఇదే రియాలిటీ అని తెలిపింది భూమి. మొత్తానికి భూమి పెడ్నేకర్ ప్రస్తుతం అటు సినిమాలతో, ఇటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. తాజాగా తను అర్జున్ కపూర్‌తో జోడీకట్టిన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ సినిమా విడుదలయ్యి మిక్స్‌డ్ రివ్యూలు అందుకుంటోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×