Jayasudha : సహజ నటిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి జయసుధ (Jayasudha). సౌత్ లో వందలాది సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతోంది. అయితే ఒకానొకప్పుడు ఏకంగా 11 మంది పిల్లలకు తల్లి కావాలని కోరుకుందట. మరి ఈ సీనియర్ హీరోయిన్ క్రికెట్ టీంలా ఇంత మందిని కనాలి అనుకోవడానికి గల కారణం ఏంటి ? ఆమె అనుకున్నది ఎందుకు జరగలేదు ? అనే వివరాల్లోకి వెళితే…
11 మందిని కనాలనుకున్న జయసుధ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ గతంలో తాను కొన్ని సిల్లీ స్టేట్మెంట్లు ఇచ్చేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ “అప్పట్లో నేను ఒక క్రికెట్ టీంని కంటాను అని స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు పిల్లల్ని కనడం ఈజీ అనుకున్నాను. కానీ ఒక బిడ్డను కనగానే తెలిసింది అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? బిడ్డను కన్నడం అంటే ఏంటి అనేది. 11 మంది క్రికెట్ టీం ను కనడమా… అప్పట్లో అసలు తెలిసేది కాదు. అలా అనుకునేదాన్ని” అంటూ క్లారిటీ ఇచ్చారు.
కమల్ హాసన్ తో పెళ్ళి
ఇక ఇదే ఇంటర్వ్యూలో “అప్పట్లో జయసుధ, కమల్ హాసన్ మ్యారేజ్ చేసుకుంటారు అనుకునేవారు ?” అనే ప్రశ్నకు… “అప్పట్లో స్టేజ్ మీద పాటలు పాడే వాళ్ళం. ఆయన గుడ్ సింగర్. నేను పాడను కానీ ఆయన పక్కన నిలుచుంటే పాట వచ్చేది. మేము బాల చందర్ గారి సినిమాలు చేసేటప్పుడు ఏమనిపించేది అంటే… అప్పట్లో పెద్ద పెద్ద ఏజ్ ఉన్న పెద్ద హీరోలు ఉండేవారు. ఆ టైంలో కమల్ హాసన్ చిన్నగా, క్యూట్ గా, హ్యాండ్సమ్ గా ఉండేవారు. యంగ్ టీనేజర్ వచ్చే సరికి ఆయన డాన్స్ తో, యాక్టింగ్ తో మిగతా వాళ్లతో పోలిస్తే డిఫరెంట్ గా అనిపించేవారు. అదే టైంలో నేను కూడా హీరోయిన్ గా రావడంతో పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఈ అమ్మాయి ఎవరు ? అని ఆరా తీసేవారు. మేము ఇద్దరమే కలిసి ఎక్కువగా సినిమాలు చేసేవాళ్ళం. బాలచందర్ గారి సినిమాలు మేమిద్దరమే ఎక్కువగా చేశాము. సినిమాలు చేసినా, లేదంటే స్టేజిపై పాడినా చూసే వాళ్లకు అలా అనిపించేది. సహజనటి అనే బిరుదు ఎలా ఇచ్చారో… అలా ఆ రోజుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవారు” అని క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఈ సందర్భంగా జయసుధ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ “నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటాను. వాళ్లు చాలా స్పెషల్ పర్సన్స్. వాళ్ల గురించి ఇక్కడ ఏదో మాట్లాడి, ఆ తర్వాత సోషల్ మీడియాలో పని పాట లేని వాళ్ళు ఎవరో వాళ్లపై కామెంట్ చేయడం నాకు నచ్చదు. అందుకే నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడను” అంటూ కుండ బద్దలు కొట్టింది జయసుధ.