BigTV English

America Red list: అమెరికా రెడ్ లిస్ట్ లో భూటాన్.. ఎందుకంటే..?

America Red list: అమెరికా రెడ్ లిస్ట్ లో భూటాన్.. ఎందుకంటే..?

డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల ముందు చెప్పినట్టే ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత పలు కఠిన నిర్ణయాలు అమలులోకి తెస్తున్నారు. ఇప్పటికే దిగుమతి సుంకాలు భారీగా పెంచేయడంతో కొన్ని ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రతిగా అమెరికాకు కూడా చైనా లాంటి దేశాలు సవాల్ విసురుతున్నా.. చిన్న దేశాలు మాత్రం అమెరికా ఆంక్షలతో విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా తాజాగా రెడ్ లిస్ట్ తయారు చేసింది. ఈ రెడ్ లిస్ట్ లో 11 దేశాలున్నయి. ఆయా దేశాల వాసులు అమెరికా వెళ్లాలంటే అంత సులభం కాదు. దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. అలాంటి రెడ్ లిస్ట్ లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి తీవ్రవాద దేశాలు ఉంటే ఆశ్చర్యం లేదు. అయితే.. భూటాన్ వంటి శాంతికాముక దేశాలు కూడా ఆ లిస్ట్ లో ఉండటం ఆసక్తికరం.


టార్గెట్ భూటాన్..
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భూటాన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఒకటి నుంచి ఐదు ర్యాంకుల్లో తరచూ చోటు సంపాదించుకుంటుంది. భూటాన్ తో ఇరుగు పొరుగు దేశాలకు కూడా ఎలాంటి విభేదాలు లేవు. అంతర్గత కల్లోలాలు లేవు, తీవ్ర దాడులు అంతకన్నా లేవు. కానీ ఎక్కడో ఉన్న అమెరికా మాత్రం భూటాన్ పై కక్షగట్టింది. భూటాన్ వాసులకు అమెరికాలోకి ప్రవేశం లేదంటూ గేట్లు మూసేసింది.

ఎందుకీ కక్ష..?
భూటాన్ శాంతికాముక దేశమే కావొచ్చు. ఆ దేశంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకపోవచ్చు. కానీ కొంతకాలంగా భూటాన్ వాసులు చేస్తున్న పని మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి నచ్చట్లేదు. అమెరికా నిఘా సంస్థల తాజా నివేదిక ప్రకారం, భూటాన్ జాతీయులు తమ వీసాల గడువు ముగిసినా కూడా అమెరికాని వీడి వెళ్లడం లేదట. అక్కడే తప్పుడు సర్టిఫికెట్లతో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారట. అనధికారికంగా అమెరికాలో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారట. అందుకే ఆ దేశంపై అమెరికా కన్నెర్రజేస్తోంది. అమెరికాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం గతేడాది అమెరికాకు వచ్చిన భూటాన్ సందర్శకుల్లో 37శాతం మంది వీసా నిబంధనలు ఉల్లంఘించారు. గతంలో కూడా వారి సంఖ్య అధికంగానే ఉందని సమాచారం. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భూటాన్ ని రెడ్ లిస్ట్ లో పెట్టింది. అంటే ఇకపై భూటాన్ వాసులు అమెరికా వెళ్లాలంటే వీసా స్క్రీనింగ్ టెస్ట్ మరింత కఠినంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారి వీసా దరఖాస్తులను ఎలాంటి నిర్దిష్ట కారణం చూపకుండానే తిరస్కరించే హక్కు అమెరికాకు ఉంటుంది.


రెడ్ లిస్ట్..
ఇక రెడ్ లిస్ట్ లో భూటాన్ తోపాటు క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజులా, యెమెన్‌, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. మొత్తం 11 దేశాలను అమెరికా రెడ్ లిస్ట్ లో పెట్టింది. అంటే ఆయా దేశాలనుంచి వచ్చేవారికి వీసాలు జారీ చేయకూడదని అమెరికా నిర్ణయించింది.

ఆరెంజ్ లిస్ట్..
ఈ లిస్ట్ లో ఉన్న దేశాలకు కొన్ని వెసులుబాటులు ఉంటాయి. పరిమితంగా వీసాలను జారీ చేస్తారు. మయన్మార్, పాకిస్తాన్, బెలారస్, ఎరిత్రియా, హైతీ, లావోస్, రష్యా, సియెర్రా లియోన్, దక్షిణ సూడాన్, తుర్కెమిస్తాన్.. ఈ లిస్ట్ లో ఉన్నాయి.

ఎల్లో లిస్ట్..
ఇక ఎల్లో లిస్ట్ అంత ప్రమాదకరమైనది కాదు. ఈ లిస్ట్ లోని దేశాలపై కూడా ఆంక్షలు ఉన్నా.. అవి అంత కఠినం కాదు. అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, బుర్కినా ఫాసో, కాంబోడియా, కామెరూన్, కేప్ వెర్డే, చాడ్, కాంగో రిపబ్లిక్, కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్, డొమినికా, ఈక్వెటోరియల్ గినియా, గాంబియా, లైబీరియా, మలావి, మాలి, మౌరిటానియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సావో టోమ్ అండ్ ప్రిన్సిప్, వనువాటు, జింబాబ్వే దేశాలు అమెరికా ఎల్లో లిస్ట్ లో ఉన్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×