BigTV English

Mr. Bachchan – Jikki song: మిస్టర్ బచ్చన్ నుంచి మరో మెలోడీ సాంగ్ ప్రోమో..

Mr. Bachchan – Jikki song: మిస్టర్ బచ్చన్ నుంచి మరో మెలోడీ సాంగ్ ప్రోమో..

Mr. Bachchan: రవితేజ ఈసారి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు. గతంలో రెండు మూడు సినిమాలతో వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ సారి మాత్రం ఎలాగైన హిట్ కొట్టి తమ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్య శ్రీ బోర్స్‌ తన అందంతో ఆకట్టుకుంది. సాంగ్స్‌లో తన అందానికి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఆమె మొదటి సినిమా ఇదే కావడంతో భాగ్య శ్రీ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే రవితేజతో మిరపకాయ్, షాక్ సినిమాలు తీసి మంచి హిట్ కొట్టిన దర్శకుడు కూడా ఈ మూవీపై మంచి అంచనాలు పెట్టుకున్నాడు.

Also Read: ఏంటి తమ్ముళ్లు.. సీట్ దొరకలేదా.. మెట్రోలో రవితేజ వాయిస్.. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్


ఈ సినిమాను రీమేక్‌గా తెరకెక్కిస్తున్నాడు. హిందీలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘రైడ్’ సినిమాకు ఇది రీమేక్. ఇకపోతే ఇప్పటికే వచ్చిన అప్డేట్లకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అప్డేట్‌తో మేకర్స్ సర్‌ప్రైజ్ అందించారు. ‘మిస్టర్ బచ్చన్’లోని మూడో సింగిల్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ, భాగ్య శ్రీ బోర్స్ రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. భాగ్యశ్రీ తన నడుము అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

‘జిక్కి’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఫుల్ సాంగ్‌ను రేపు అనగా ఆగస్టు 2న సాయంత్రం 4.59 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా దూసుకుపోతుంది. మొత్తంగా మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం థియేటర్లలో మోత మోగించేయడం ఖాయమని రవితేజ అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌ లెవెల్లో నిర్మిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×