E-Paper
Advertisement

Ear Problems: చెవులు శుభ్రంగా లేకుంటే చెవుడు వస్తుందట..! మరి క్లీన్ చేసుకోవడమెలా?

Ear Problems: చెవులు శుభ్రంగా లేకుంటే చెవుడు వస్తుందట..! మరి క్లీన్ చేసుకోవడమెలా?
Advertisement

Ear Problems: చెవులు మన శరీరంలోని చాలా కీలకమైన అవయవాలు. శబ్దాలను అర్థం చేసుకోవడంలో ఇవి సహాయం చేస్తాయి. అయితే, చెవులు శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే, చెవుల్లో చెత్త, గుబిలి ఇతర అనవసర పదార్థాలు చేరిపోవడం వల్ల వినికిడి సమస్యలు వచ్చి, ఇతర సమస్యలను కూడా కలిగించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చెవుల్లో ఇయర్ వ్యాక్స్ తయారు కావడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. ఇది చెవులను బాక్టీరియా, వైరస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే, గుబిలి ఎక్కువగా చేరినప్పుడు అది చెవులను బ్లాక్ చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఇయర్ వ్యాక్స్ ఎక్కువగా చేరినప్పుడు చెవులు నొప్పిగా అనిపిస్తాయట. దీంతో వినికిడి స్పష్టత కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. చెవిలో వ్యాక్స్ ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి, వాపు వంటి సమస్యలు వచ్చి చెవిలో బాధను కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఇయర్ వ్యాక్స్ కారణంగా చెవుల్లో బాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రకమైన ఇన్‌ఫెక్షన్స్ వల్ల చెవిలో తీవ్రమైన నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.

Advertisement

చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలి?
చెవులను శుభ్రం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెవులు శుభ్రం చేయడంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ముఖ్యంగా, పిల్లలు, వృద్ధులు వాడే పరికరాలు దాదాపు ప్రమాదకరంగా ఉండవచ్చు.

చెవులను శుభ్రం చేయడం అనగానే చాలా మందికి ఇయర్ బడ్స్ లేదా కాటన్ బడ్స్ గుర్తొస్తాయి. వీటిని వాడడం అంత మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. చెవులను శుభ్రం చేయాలనే ఆలోచనతో ఇయర్ బడ్స్‌ని చెవిలో పెడితే గుబిలి మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు ఇయర్ బడ్స్ వాడకాన్ని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు.

మీరు చెవులను శుభ్రం చేసుకోవాలంటే ENT నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. చెవులు శుభ్రం చేయడానికి డాక్టర్లు సరైన మార్గాలను చూపిస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×