BigTV English

Johnny Master Case: పోలీసుల ముందుకు రాలేను.. లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్ ఇచ్చిన యువతి?

Johnny Master Case: పోలీసుల ముందుకు రాలేను.. లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్ ఇచ్చిన యువతి?

Johnny Master Case: దక్షిణాది సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న జానీ మాస్టర్ (Johnny master)అలియాస్ షేక్ జానీ బాషా పై తాజాగా అత్యాచారం కేసు నమోదయింది. పలుమార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఒక యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 376 (రేప్ కేస్ ) అలాగే సెక్షన్ 506 ( క్రిమినల్ బెదిరింపులు) సెక్షన్ 323 (గాయపరచడం) సెక్షన్ 2( క్లాజ్ )కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడు అంటూ బాధితురాలు తన ఫిర్యాదులు ఆరోపించగా…జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు రాయదుర్గం పోలీసులు.


అందుబాటులో లేనంటూ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చిన యువతి..

అయితే బాధిత యువతి వయసు 21 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ఘటన నార్సింగ్ పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు రాయదుర్గం పోలీసులు. అయితే తాజాగా ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు పలు విషయాలను వెల్లడించారు. తాజాగా నార్సింగ్ సిఐ హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను విచారిస్తున్నాము. సెప్టెంబర్ 15 మధ్యాహ్నం మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి జీరో ఎఫ్ ఐ ఆర్ వచ్చింది. లైంగికంగా వేధించాడని ఒక యువతి జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది. యువతి స్టేట్మెంట్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కానీ ప్రస్తుతానికి తాను హైదరాబాదులో లేనని చెప్పింది అంటూ సిఐ హరికృష్ణ రెడ్డి వెల్లడించారు.యువతి ఇచ్చిన స్టేట్మెంట్, ఆధారాలతో జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆమె అందుబాటులో లేనని చెబుతోంది కాబట్టి త్వరలోనే నిజా నిజాలు బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము, ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఐ.


మధ్యప్రదేశ్ యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం?

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జానీ మాస్టర్ మధ్యప్రదేశ్ కు చెందిన ఒక మహిళ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసిన ఆరోపణలు వచ్చాయి. 2017లో ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన డాన్స్ కార్యక్రమంలో జానీ మాస్టర్ ఆ అమ్మాయికి పరిచయమయ్యారట. ఆ పరిచయంతోనే తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేయమని ఆయన టీమ్ ఆ అమ్మాయికి ఫోన్ చేసిందట.

అయితే అంతకుముందు జానీ మాస్టర్ గురించి తెలియని ఆ అమ్మాయి 2019లో జానీ మాస్టర్ టీంలో చేరింది. ఇక షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో ముంబైకి వెళ్ళినప్పుడు, అక్కడ బస చేసిన హోటల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి ఆరోపణ. చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, ఒకసారి క్యారవాన్ లో తన ఫాంట్ విప్పి జుట్టు పట్టుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సదరు యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఆ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక త్వరలోనే నిజా నిజాలు తెలియనున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×