OTT Movie : డిజిటల్ మీడియా ఈరోజుల్లో ఎలా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి వేదికగా నిలిచింది. ఇందులో భాషతో సంబంధం లేకుండా, నచ్చిన సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ మూవీలో భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు భర్త. ఎమోషన్స్ తో సాగిపోయే ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మరాఠీ మూవీ పేరు ‘తప్తపది’ (Tabtapadi). ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఒక చిన్న కథ దృష్టిదాన్ నుండి ప్రేరణ పొందిన భారతీయ చిత్రం. దీనికి సచిన్ బలరామ్ నాగర్‌గోజే దర్శకత్వం వహించారు. ఇందులో కశ్యప్ పరులేకర్, వీణా జామ్‌కర్, శృతి మరాఠే, నీనా కులకర్ణి, శరద్ పోంక్షే, అంబరీష్ దేశ్‌పాండే, అశ్విని ఎక్బోటే ప్రధాన పాత్రల్లో నటించారు. ‘తప్తపది’ మూవీ 28 మార్చి 2014న విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మీరా, మాధవ్ చిన్నప్పటి నుంచి ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. తన అత్త కొడుకే కావడంతో చిన్నప్పుటినుంచి క్లోజ్ గానే ఉండేది మీరా. ఆ తర్వాత మాధవ్ చదువు కోసం సిటీకి వెళ్లిపోతాడు. డాక్టర్ విద్యను చదువుతూ ఉంటాడు. ఇంతలోనే మాధవ్, మీరాల పెళ్లి ఇంట్లో వాళ్ళు నిశ్చయిస్తారు.ఇద్దరికీ పెళ్లికూడా జరిగిపోతుంది. వీళ్ళ సంసారం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. మాధవ్ తనని చాలా ఇష్టంగానే చూసుకుంటూ ఉంటాడు. అయితే మీరా కంటికి ఏదో జబ్బు వస్తుంది. దానిని నయం చేయడానికి మందులు వాడుతుంటాడు మాధవ్. ఒకరోజు మీరా అన్నయ్య ఇంటికి వస్తాడు. తన కళ్ళల్లో నీళ్లు కారుతుండడం చూసి, మంచి డాక్టర్ కి చూపించుకోమని మీరాకి చెప్తాడు. మాధవ్ డాక్టర్ కావడంతో, ఆ మాటలు విని చాలా బాధపడుతాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆమెకు కళ్ళు కనిపించకుండా పోతాయి. దానికి అందరూ మాధవ్ ను నిందిస్తారు.
మీరా భర్తను వెనకేసుకొస్తుంది. ఇందులో అతని తప్పేమీ లేదని, నా ప్రాణం ఉన్నంతవరకు అతనితోనే ఉంటానని చెప్తుంది. మాధవ్ ఆమెను చూసుకోవడానికి పనిమనిషిని ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత మాధవ్ మేనత్త అతనికి మరో పెళ్లి చేయాలనుకుంటుంది. సునంద అనే అమ్మాయితో పెళ్లిచూపులు కూడా ఏర్పాటు చేస్తుంది. మొదట పెళ్లికి నిరాకరించిన మాధవ్, ఆమె అందాన్ని చూసి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఈ విషయం భార్యకి తెలియకుండా జాగ్రత్త పడతాడు. చివరికి మాధవ్ కి సునందతో పెళ్లి జరుగుతుందా? ఈ విషయం భార్యకు తెలుస్తుందా? ఆ తర్వాత వీరి జీవితం ఎలా ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తప్తపది’ (Tabtapadi) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.