BigTV English

Jr NTR : మళ్లీ రిలాక్స్ అవుతున్న యంగ్ టైగర్… మరి ఆ మూడు సినిమాల పరిస్థితేంటయ్యా?

Jr NTR : మళ్లీ రిలాక్స్ అవుతున్న యంగ్ టైగర్… మరి ఆ మూడు సినిమాల పరిస్థితేంటయ్యా?

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. ఓవైపు ఆయన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా (Dragon) సెట్ లో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారా ? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం గత కొంతకాలంగా పూర్తిగా వెకేషన్ మోడ్ లో ఉంటున్నారు. ‘దేవర’ (Devara) ప్రమోషన్లతో మొదలైన ఈ రిలాక్స్ మోడ్ ఇంకా కొనసాగుతూ ఉండడం విశేషం. దీంతో తారక్ ఇంత కూల్ గా ఉన్నారేంటి ? మరి ఆయన చేయబోయే నెక్స్ట్ మూడు సినిమాల పరిస్థితి ఏంటి? అనే అయోమయంలో పడ్డారు నందమూరి అభిమానులు.


యూఏఈలో తారక్ వెకేషన్ 

‘దేవర 2’ సక్సెస్ తరువాత తారక్ చేయబోయే నెక్స్ట్ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మధ్యలో ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ ‘వార్ 2’ షూటింగ్ వల్ల ఆయన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ కాస్త ఆలస్యమైంది. అయితే పలు కారణాల వల్ల ‘వార్ 2’ షూటింగ్ లో జాప్యం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఎన్టీఆర్ తన పార్ట్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు ఎన్టీఆర్.


అందులో భాగంగా ఇటీవలే ‘దేవర’ ప్రమోషన్స్ కోసం ఫ్యామిలీతో సహా జపాన్ వెళ్లిపోయారు. అక్కడ ఎన్టీఆర్ చేసిన సందడి అంతా కాదు. అలాగే తన భార్య ప్రణతి పుట్టినరోజు కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. తిరిగి రాగానే ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు తారక్. అలాగే తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ మూవీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు.

ఇక నెక్స్ట్ మూవీ సెట్లో అడుగు పెట్టడమే తరువాయి అనుకుంటున్న అభిమానులకు తాజాగా షాక్ ఇచ్చారు. ఆయన ఫ్యామిలీతో కలిసి మళ్ళీ వెకేషన్ కి వెళ్ళిపోయారు. సోషల్ మీడియాలో తారక్ తన కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి యూఏఈ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి ప్రత్యక్షమైంది. దీంతో మళ్లీ తారక్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్తే ఆయన చేయాల్సిన ఆ మూడు సినిమాల పరిస్థితి ఏంటి? అనే గందరగోళం నెలకొంది.

Read Also : జీ5 లో తప్పకుండా చూడాల్సిన టాప్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే

‘డ్రాగన్’ కోసం షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్ 

ఇక ఇప్పటికే ‘వార్ 2’ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ సెట్ లో అడుగు పెట్టబోతున్నారని మేకర్స్ అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చారు. కానీ ఈ షెడ్యూల్ టైంకి ఇంకా వారం రోజుల గ్యాప్ ఉండడంతో ఈలోపు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. ‘డ్రాగన్’ షూటింగ్ పూర్తికాగానే ఆయన ‘దేవర 2’ షూటింగ్ను మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, స్వయంగా జక్కన్న ఎన్టీఆర్-నీల్ కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని లీక్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ప్రమోషన్లలో జూనియర్ ఎన్టీఆర్ బక్క చిక్కిన రూపంలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రశాంత్ నీల్ మూవీ కోసమే అని టాక్ నడుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×