BigTV English

Nandamuri Taraka Ramarao: ఆ వంశం నుంచి నాలుగో తరం సింహం వస్తున్నాడు… ఫస్ట్ లుక్ చూశారా…?

Nandamuri Taraka Ramarao: ఆ వంశం నుంచి నాలుగో తరం సింహం వస్తున్నాడు… ఫస్ట్ లుక్ చూశారా…?

Nandamuri Taraka Ramarao: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అల్లు, మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కుటుంబాలు ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ అందుకున్నాయి. ముఖ్యంగా ఈ ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు, స్టార్ హీరోలుగా , గ్లోబల్ స్టార్ లుగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ కుటుంబాల నుంచి కేవలం తండ్రీ, కొడుకు ఇలా రెండు తరాల హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఒక వంశం నుంచి ఏకంగా నాలుగో తరం హీరో అంటే..ఇక ఆ కుటుంబం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అదేనండీ..నందమూరి ఫ్యామిలీ (Nandamuri). స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వారి వారసులు, వారి వారసులు ఇలా మొత్తం నాలుగు తరాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాయి అంటే నందమూరి ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు.


నందమూరి నాలుగో తరం హీరో ఫస్ట్ లుక్..

తాజాగా నందమూరి వంశం నాల్గవ తరానికి చెందిన అబ్బాయి.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు రాగా.. తాజాగా ఈయన మొదటి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటూ వీడియో కూడా రిలీజ్ చేశారు దర్శకులు వైవిఎస్ చౌదరి. జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్ తో బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే లుక్ లో దర్శనం ఇవ్వడం అభిమానులలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. 19 ఏళ్ళు అమెరికాలో యాక్టింగ్ లో మాస్టర్స్ చేసి అన్ని కళలలో ప్రావీణ్యం పొందిన ఈయన, హీరో కుటుంబ సభ్యుల సపోర్టుతో, ముత్తాత రామారావు ఆశీస్సులతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.


చాలాకాలం తర్వాత డైరెక్టర్ మళ్ళీ ఎంట్రీ..

వైవిఎస్ చౌదరి విషయానికి వస్తే.. నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా మారిన వైవిఎస్ చౌదరి యమరాజు, సీతారామరాజు, సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, ఒక్కమగాడు, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, దేవదాస్, సలీం, రేయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలకు దర్శకుడిగానే కాదు ఎంతోమందికి కెరియర్ ప్రసాదించారు కూడా. అలా తన సినిమాల ద్వారా ఇలియానా, రామ్ పోతినేని , సాయి ధరంతేజ్, వెంకట్ వంటి వారికి అవకాశం కల్పిస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

హరికృష్ణ మనవడే ఈ హీరో..

చివరిగా సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రేయ్ సినిమాకి దర్శకత్వం వహించిన ఈయన.. సినిమా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఇప్పుడు చాలాకాలం తర్వాత నందమూరి నాలుగవ తరం నట వారసుడిగా.. జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావును హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ పెద్దకొడుకు జానకిరామ్ కొడుకే ఈ జూనియర్ ఎన్టీఆర్. నాలుగవ తరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న ఈ కొత్త హీరో తాతకు తగ్గ మనవడిగా, బాబాయ్ కి తగ్గ కొడుకుగా పేరు సొంతం చేసుకుంటారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×