Ghost Effigy Viral Video: భారతదేశంలో వ్యవసాయం ఓ పెద్ద క్షేత్రం లాంటిది. చాలా మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పొలం, మొక్కజొన్న, పసుపు, మిర్చి, కూరగాయలు, పండ్లు తదితర వాటిని వేసి ఆదాయం పొందుతుంటారు. ఎంతో మందికి భోజనం పెట్టే రైతన్నలకు కొన్ని సార్లు చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. పొలాల్లో పంటను వేసినప్పటి నుంచి తిరిగి దానిని అమ్మి చేతులోకి డబ్బులు వచ్చేంత వరకు నానా కష్టాలు పడుతుంటారు.
ఈ తరుణంలో పొలాల్లో వేసిన పంటను పక్షులు, కోతులు, ఇతర జంతువుల నుంచి రక్షించుకునేందుకు దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ తరుణంలో కొంత మంది రైతులు వినూత్న ఆలోచనలు చేస్తుంటారు. తాజాగా ఓ రైతు చేసిన వినూత్న దిష్టిబొమ్మ అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. దీనికి పక్షులు, జంతువులు ఏంటి మనుషులు కూడా రావడానికి భయపడుతుంటారు. మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దిష్టిబొమ్మ వీడియోలో పొలం మధ్యలో ఓ దిష్టిబొమ్మను పెట్టాడు రైతు. అయితే ఆ దిష్టిబొమ్మ అచ్చం దెయ్యంలా కనిపించింది. దిష్టిబొమ్మను దెయ్యం మాస్క్ వేసి తయారు చేశాడు. అంతేకాదు దానికి ఓ స్ప్రింగ్ ను ఏర్పాటు చేశాడు. దిష్టిబొమ్మకు దెయ్యం మాస్క్ వేసి, తలకు ఎరుపు రంగు ఓని చుట్టాడు. గ్రీన్ కలర్ షర్ట్ వేసి, బ్లూ కలర్ చీరను కట్టాడు. దీనిని స్ప్రింగ్ కు వేలాడదీశాడు. దీంతో దిష్టిబొమ్మను చూస్తే నిజంగా అక్కడేదో దెయ్యం ఉన్నట్లే తయారైంది.
ఈ దిష్టిబొమ్మను చూస్తే పక్షులేం కర్మ, మనుషులు కూడా పొలంలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది. దీంతో చుట్టు పక్కల గ్రామస్థులు కూడా దిష్టిబొమ్మ గాల్లో ఎగరడం చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అసలు దిష్టిబొమ్మను ఇలా తయారు చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో కోసం కింద ఫోటోపై క్లిక్ చేయండి..