BigTV English

War 2 Movie: RRR ఎఫెక్ట్.. ఆ దర్శకునితో ఎన్టీఆర్ గొడవ.. కంగారు పడుతున్న ఫ్యాన్స్!

War 2 Movie: RRR ఎఫెక్ట్.. ఆ దర్శకునితో ఎన్టీఆర్ గొడవ.. కంగారు పడుతున్న ఫ్యాన్స్!
NTR - Hrithik Roshan New Movie

Jr NTR Fights with War 2 Director Ayan Mukerji: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే అంతటి భారీ విజయం తర్వాత అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ తమ తదుపరి సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారనే టాక్ ఇప్పటికీ ఉంది.


ఈ సినిమాలో ఎన్టీఆర్ అద్భుతమైన నటనతో తన పాత్రలో ఒదిగిపోయినా.. క్రెడిట్ అంతా రామ్ చరణ్‌కి వెళ్లిపోయిందని టాక్. ఇందులో రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్య ఉండటం.. ఎన్టీఆర్‌ను డామినేట్ చేసేలా ఉండటంతోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫీలయ్యారు. అంతేకాకుండా వీటిపై ట్రోల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. అందువల్ల అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ అలాంటి పరిస్థితే ఎన్టీఆర్‌కు వచ్చినట్లు సమాచారం.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ మూవీ చేస్తున్నాడు. దర్శకుడు ఆయన్ ముఖర్జీని తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.


Read More: టైగర్ 3 లో వార్ 2 కొత్త విలన్ .. ఆ హైప్ అంతా తారక్ కోసమేనా?

అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర.. హృతిక్ రోషన్‌ను ఢీకొట్టేలా ఉంటుందని టాక్. దీనికి సంబంధించి ఎన్టీఆర్ లుక్‌ను ఇప్పటికే టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను హృతిక్ రోషన్ డామినేట్ చేసేలా ఉంటుందని సమాచారం.

అందువల్లనే తారక్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో సపోర్టింగ్ హీరోగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు ‘వార్2’లో కూడా అలా జరగకూడదని ఆలోచిస్తున్నాడట. అందువల్లే డైరెక్ట్‌గా దర్శకుడు ఆయన్ ముఖర్జి దగ్గరకు వెళ్లి కథలో మార్పులు చేయాలని అన్నాడట. తన పాత్రకు మంచి ప్రాధాన్యత క్రియేట్ చేయాలని తెలిపాడట.

Read More: వార్ 2 డేట్ ఫిక్స్ .. సమరం ఆ రోజే ఆరంభం..

అయితే ఎన్టీఆర్ మాటలకు డైరెక్టర్ ఏ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. సినిమాలో హీరో.. విలన్ ఎలా ఉండాలో అలాగే తన స్క్రిప్ట్ ఉందని.. దాని ప్రకారమే సినిమాను తెరకెక్కిస్తానని డైరెక్టర్ ముఖర్జి తన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఒకవేళ ఎన్టీఆర్ ఈ ‘వార్2’ మూవీలో కూడా ప్రాధాన్యత లేని పాత్ర చేస్తే ఆయన ఫ్యాన్స్‌‌కు మరొక చేదు జ్ఞాపకమే మిగులుతుంది.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×