BigTV English
Advertisement

Devara on Netflix : దేవర క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్… దేవర చావు వెనక ఉన్న అసలు నిజమిదే..

Devara on Netflix : దేవర క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్… దేవర చావు వెనక ఉన్న అసలు నిజమిదే..

Devara on Netflix : జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర చేసిన శివ తాండవం దేవర మూవీ ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 500 కోట్లకుపైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ అర్థరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో సినిమా రావడంతో.. సినిమాలో ఉన్న ట్విస్ట్ లను కనిపెట్టే పనిలో పడ్డారు నెటిజన్లు. ప్రతి సీన్ డీటైల్‌గా చూసి, కొరటాల శివ పెట్టిన ట్విస్ట్ లను రివీల్ చేస్తున్నారు. దేవర సినిమాలో బాహుబలి రేంజ్ ట్విస్ట్ క్లైమాక్స్ అని చెప్పుకుంటున్నారు. ఆ ట్విస్ట్ రివీల్ అయింది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…


దేవర సినిమా చూసిన తర్వాత అందరికీ… దేవర చనిపోయాడా లేదా..? చనిపోతే ఎవరు చంపారు..? దేవరను వరనే చంపాడా..? వర ఎందుకు చంపాడు..? ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. ఈ క్వశ్చన్స్‌కు ఆన్సర్ వెతికే పనిలో పడ్డారు సినీ లవర్స్. ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమాను స్లో మోషన్ లో చూస్తూ ప్రతి పాయింట్‌ను గమనిస్తున్నారు.

ఈ క్రమంలో క్లైమాక్స్‌లో దేవర చనిపోవడం అనే ట్విస్ట్ విషయంలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో దేవరను వర హత్య చేసినట్టు చూపించి… దేవర పార్ట్ 2పై ఆసక్తి పెంచేలా చేశాడు డైరెక్టర్ కొరటాల.


దీంతో దేవర ఎలా చనిపోయాడు ? నిజంగానే దేవరను వరనే చంపాడా..? వీటి కోసం దేవర సెకండ్ పార్ట్ చూడాలి అని తారక్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎదురు చేస్తున్నారు.

దీనికి సంబంధించి సినిమాలోని ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో దేవర ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. తానే కత్తిని గుచ్చుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత సినిమాపై సెకండ్ పార్ట్ పై మరిన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఒక నిజంగానే దేవర ఆత్మహత్య చేసుకుంటే.. ఎందుకు ఆ పని చేశాడు..? దాన్ని వర చంపినట్టు ఎందుకు చూపించారు అనేది తెలియాలంటే… సెకండ్ పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది.

నిజానికి ఈ క్లైమాక్స్ ట్విస్ట్ గురించి ఇప్పటి వరకు చాలా వరకు వార్తలు వచ్చాయి. దేవర చనిపోలేదని, కేవలం గాయపడ్డాడని కొన్ని రోజుల క్రితం న్యూస్ బయటికి వచ్చింది. అలాగే, సైఫ్ అలీ ఖాన్ నే దేవర చంపించాడని, ఆ టైంలో వర అక్కడ ఉన్నాడని కూడా అంటున్నారు. ఇలా చాలా ఊహాగణాలు ఈ ట్విస్ట్ కు సంబంధించి వస్తున్నాయి. ఈ క్లైమాక్స్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా… కొరటాల శివ అసలు ఏం డిజైన్ చేశాడు అనేది తెలియాలంటే… సెకండ్ పార్ట్ వచ్చే వరకు ఎదురుచూడటం తప్పా.. మరేం ఆప్షన్ లేదు.

కాగా, ప్రస్తుతం దేవర హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో వస్తున్న వార్ 2 సినిమా షూటింగ్ లో ఉన్నాడు. వార్ 2 పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నాడు. అది  పూర్తి అయ్యేకే దేవర పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×