Skin Care Tips: వయస్సు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ రావడం సర్వసాధారణం. కానీ కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వడంతో పాటు పోషకాహారం తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి.
ఏ సీజన్ అయినా చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఆహారంలో సరైన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా, ముఖంపై వృద్ధాప్య ప్రభావాలను కు తగ్గించుకోవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే 45 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లుగా కనిపిస్తారు. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాంటి 5 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5 ఆహారాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి:
బెర్రీలు:
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి, ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఈ బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని బలపరుస్తుంది.
అవకాడో:
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. అంతే కాకుండా ముడతలను తగ్గిస్తుంది. అవకాడో తరుచుగా తినడం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
బచ్చలికూర, పాలకూర వంటి ఆకు కూరలు విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ముడతలను తగ్గించడంలో ఈ విటమిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
క్యారెట్:
క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. విటమిన్ ఎ చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతే కాకుండా ముడుతలను తగ్గించడంలో సహాయపడుతుంది. తరుచుగా గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.
Also Read: బంగాళదుంపతో అదిరిపోయే అందం మీ సొంతం
టమాటోలు:
టమాటోలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. తరుచుగా ముఖానికి టమాటో వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉకం తెల్లగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.