BigTV English
Advertisement

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?

Jr. NTR:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR ).. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు సొంతం చేసుకున్నారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్.. ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి వార్ -2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరొకవైపు కేజీఎఫ్ 1&2 సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు అనుకోగా.. ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమా నుండి అప్డేట్ తర్వాత విడుదల చేస్తామని తెలిపారు.


ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అదేనట..

ఇదిలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ కి కృష్ణుడి పాత్రలో నటించాలని డ్రీమ్ వుందట. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఆ పాత్ర రావాలి అని కూడా కోరుకుంటున్నారట. ఇక ఈ విషయం తెలిసి కృష్ణుడి రోల్ కి తారక్ బాగా సూట్ అవుతాడని నెటిజన్స్ నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ‘మహాభారతం’ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో నటించి తన డ్రీమ్ రోల్ కోరికను నెరవేర్చుకుంటాడేమో చూడాలి అని నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజమౌళికి, ఎన్టీఆర్ కి మంచి అవినాభావ సంబంధం ఉంది. రాజమౌళికి కెరియర్ ఇచ్చింది కూడా ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్ అడిగితే రాజమౌళి కాదనే ప్రసక్తే లేదు. అందుకే మహాభారతం సినిమాలో కృష్ణుడి పాత్ర ఎన్టీఆర్ కే అంటూ అప్పుడే అభిమానులు కూడా ఫిక్స్ అయిపోతున్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఎన్టీఆర్ సినిమాలు..

ఇకపోతే ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్లలో బిజీగా పాల్గొంటున్నా.. వేరువేరు కారణాలవల్ల సినిమా షూటింగులు మాత్రం వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ తన తాతకు ఏమాత్రం తీసిపోదు అని చెప్పవచ్చు. అందుకే ఆయన టాలెంట్ కు తగ్గ రోల్స్ పడితే మాత్రం కచ్చితంగా ఆయన రేంజ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని నెటిజన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో మంచి విజయం అందుకున్న ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలతో పాటు దేవర2, డ్రాగన్ మూవీలు ఇప్పుడు ఈయన చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు థియేటర్లో విడుదలవుతాయో చూడాలి. ఇక అంతేకాదు ఈ నాలుగు సినిమాల బడ్జెట్ కూడా రూ.1500 కోట్లకు పైగానే ఉండడంతో ఈ సినిమాలు విడుదలై ఎన్టీఆర్ మార్కెట్ ను మరింత పెంచాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మునుముందు ఎన్టీఆర్ తన సినిమాలతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×