BigTV English
Advertisement

Viral Video: రన్నింగ్ ట్రైన్ కు వేలాడుతూ స్టంట్స్, జారిపడి స్పాట్ లోనే.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: రన్నింగ్ ట్రైన్ కు వేలాడుతూ స్టంట్స్, జారిపడి స్పాట్ లోనే.. నెట్టింట వీడియో వైరల్!

సోషల్ మీడియా రీల్స్ కోసం యువకులు వేసే వెర్రి వేషాలు ప్రాణాల మీదికి తీసుకొస్తున్నాయి. లైక్స్, కామెంట్స్ కోసం చేసే డేంజర్ స్టంట్స్  ప్రాణాలు పోయేలా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్స్, రన్నింగ్ ట్రైన్స్ లో రీల్స్ తీయకూడదు, ఫోటోలు, వీడియోలు షూట్ చేయకూడదని రైల్వే అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేసినా పద్దతి మార్చుకోవడం లేదు. చివరకు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కదులుతున్న రైల్లో స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బంగ్లాదేశ్ లో రైల్లో నుంచి పడి వ్యక్తి దుర్మరణం

రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఓ వ్యక్తి రన్నింగ్ ట్రైన్ లో డోర్ దగ్గర హ్యాండిల్ పట్టుకుని వేలాడుతూ స్టంట్స్ చేశాడు. మధ్యలోకి రాగానే కాలు జారింది. బ్యాలెన్స్ కోల్పోయాడు. కాళ్లు ట్రాక్ పక్కన కంకర రాళ్లను తాకుతూ ఈడ్చుకుంటూ వచ్చాడు. పైగా చేతిలో ఓ సంచి కూడా పట్టుకుని ఉన్నాడు. మళ్లీ సెట్ రైట్ అయినా బుద్ది మార్చుకోలేదు. ట్రాక్ పక్కనే ఉన్న కాంక్రీట్ దిమ్మెల మీద కాళ్లు పెడుతూ ముందుకు కదిలాడు. చివరకు రైల్వే స్టేషన్ దగ్గరికి రైలు చేరుకుంది. కానీ, అప్పటికే పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోవడంతో తను జారి రైలు, ట్రాక్ మధ్యలోకి జారిపోయాడు. రైలు చక్రాల కింద పడి నుజ్జు నుజ్జు అయ్యాడు. ఈ ఘటన బొగురా రైల్వే స్టేషన్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


Read Also: టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ బంపర్ ఆఫర్!

స్టంట్స్ చేశాడా? జారిపడ్డాడా?   

ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కావాలనే స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడని కొంత మంది అంటుంటే, రైలు ఎక్కే సమయంలో జారి ప్రాణాలు కోల్పోయాడని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.   రైలు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఇదో ఇదో బెస్ట్ ఎగ్జాంఫుల్ అంటున్నారు. ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. రైలు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం, దిగడం చేయాలని సూచిస్తున్నారు. డేంజర్ స్టంట్స్ చేసే సమయంలో మన కోసం ఇంటి దగ్గర ఓ ఫ్యామిలీ ఎదురు చూస్తుందని గుర్తుంచుకోవాలంటున్నారు. కొద్ది క్షణాల ఆనందం కోసం జీవితాన్ని పణంగా పెట్టకూడదని సలహా ఇస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూసి అయినా డేంజర్స్ స్టంట్స్ చేయడం మానుకోలవాని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లను షాక్ కు గురి చేస్తోంది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే విషయం తెలియదు.

Read Also: ఫ్లైట్ లో ఆ కుక్కలను తీసుకెళ్లొచ్చట, విమాన సంస్థల కీలక నిర్ణయం!

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×