Jr NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో లేడీ ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే మరే ఇతర హీరోలకు లేని విధంగా ఎన్టీఆర్ కు మాత్రం జపాన్లో స్ట్రాంగ్ లేడీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఓ జపనీస్ అమ్మాయి ఎన్టీఆర్ కోసం చేసిన సాహసం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది? అనే వివరాల్లోకి వెళితే…
జపాన్ లో ‘దేవర’ సందడి
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’ (Devara). ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా… కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలి సంయుక్తంగా నిర్మించారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీతోనే టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. దాదాపు 500 కోట్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి ‘దేవర’ మూవీ ని జపాన్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మార్చ్ 28న ఈ మూవీ అక్కడ రిలీజ్ కాబోతోంది. జపాన్ లో మూవీ విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అక్కడ ఎన్టీఆర్ తో సహా చిత్రం బృందం జోరుగా ప్రమోషన్లు కొనసాగిస్తుంది.
తారక్ కోసం తెలుగు నేర్చుకున్న ఫ్యాన్
‘దేవర’ ప్రమోషన్లకు సంబంధించి తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఆ వైరల్ వీడియోలో ఎన్టీఆర్ తన జపాన్ లేడీ ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్ ఇస్తూ కనిపించారు. అంతలోనే ఓ అమ్మాయి సడన్ గా అక్కడికి దూసుకొచ్చి, ఎన్టీఆర్ తో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఇందులో కొత్త ఏముంది ? అందరూ అదే కదా చేస్తున్నారు అనుకోవచ్చు… కానీ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా ఆ జపాన్ అమ్మాయి తెలుగులో మాట్లాడుతోంది.
‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ కోసమే తెలుగు నేర్చుకున్నానని స్పష్టంగా తెలుగులో చెప్పింది. ఆమె క్యూట్ క్యూట్ గా తెలుగు మాట్లాడుతుంటే ఎన్టీఆర్ సైతం ఫిదా అయ్యారు. “మీరు బిగ్ ఇన్స్పిరేషన్” అంటూ సంతోషంగా ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే జపాన్లో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ అయ్యి మూడేళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఈ మూవీని చూశాక జపాన్ అమ్మాయి ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకోవడం అన్నది నిజంగా ప్రశంసనీయం. చూస్తుంటే జపాన్ కూడా టాలీవుడ్ లాగే తయారయ్యేలా కనిపిస్తోంది. ఇక టాలీవుడ్ తర్వాత మన సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే అది జపాన్ గురించెనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్.
RRR మూవీ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నా – తారక్‌తో జపాన్ ఫ్యాన్ #JrNTR #DevaraInJapan #Devara #BIGTVCinema @tarak9999 pic.twitter.com/UGQlzrzxFr
— BIG TV Cinema (@BigtvCinema) March 27, 2025