Sara AliKhan: స్టార్ కిడ్ సారా అలీఖాన్ (Sara AliKhan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్టార్ కిడ్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan).. ఆయన మొదటి భార్య అమృత సింగ్(Amritha Singh) దంపతుల కూతురు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ బిగినింగ్ లో ఎన్నో పరాజయాలు చవిచూసిన ఈమె.. ఆ తర్వాత నటన, అందంతో తనకంటూ ఒక ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న సారా అలీ ఖాన్ మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. అలా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, అందులో మరో హీరోయిన్ పై తన అసూయను బయటపెట్టింది.
ఆమెను చూస్తుంటే అసూయ వేస్తోంది..
ముఖ్యంగా సారా అలీ ఖాన్ , అలియా భట్ కి నేషనల్ అవార్డు రావడం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకుంది. 2021 లో 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించగా.. అందులో ఉత్తమ నటీమణులుగా అలియా భట్, కృతి సనన్ సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఇందులో “గంగూ భాయి కతియా వాడి” సినిమాలో అలియా భట్ నటనకు మెచ్చిన వారు.. ఆమెకు నేషనల్ అవార్డు అందించనున్నారు. అయితే దీని గురించి రీసెంట్గా ఒక మీడియాతో మాట్లాడిన సారా అలీ ఖాన్..” ప్రస్తుతం ఆలియా తన లైఫ్ లో ఎంతో సంతోషంగా ఉంది. అటు కెరియర్ విషయంలోనే కాదు వ్యక్తిగతంగా కూడా సంతోషంగా జీవిస్తోంది. వాస్తవానికి ఈ స్థాయికి రావడానికి ఆమె ఎంత కష్టపడిందో మాకు తెలుసు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అవార్డు వచ్చినప్పుడు ఒక నటిగా నేను కూడా అసూయపడ్డాను. అలాంటి సినిమాలో నాకెందుకు అవకాశం రాలేదు అనిపించింది. సాధారణంగా ఎదుటివారిని చూసి అసూయ పడడం సహజం. కానీ దాని వెనుక ఎంత పెద్ద కష్టం ఉంటుందో ఎవరికీ కూడా అర్థం కాదు. అందరిలాగే నేను కూడా.. ఆ కష్టాన్ని ఎవరు చూడరు. అవార్డును మాత్రమే చూస్తారు.. అందుకే ఆ విషయంలో నేను కూడా అసూయపడ్డాను. అంటూ తెలిపింది. అంతేకాదు తనకు కూడా నేషనల్ అవార్డు రావాలని, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ కూడా సారా అలీ ఖాన్ తెలిపింది. ప్రస్తుతం సారా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ; Robinhood Movie : SRHపై ట్రోల్స్ కూడా చేయించారా… మీ మూవీ పబ్లిసిటీ కోసం ఎంతపనైనా చేస్తారా..?
అలియా భట్ కెరియర్..
ఇక అలియా భట్ విషయానికి వస్తే.. మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది . ఇక ఇప్పుడు మళ్లీ తెలుగులో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉంది అలియా భట్.