Salman Khan: ఈరోజుల్లో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలను పోలుస్తూ ఎక్కువగా మూవీ లవర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లాగా, ముఖ్యంగా సౌత్‌లో లాగా బాలీవుడ్ సినిమాలు చేయడం లేదని, అందుకే హిందీ సినిమా పరిస్థితి ప్రస్తుతం బాలేదని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీ టౌన్ స్టార్ హీరోలు సైతం ఈ విషయాన్ని సమ్మతిస్తున్నారు. అమీర్ ఖాన్ సైతం ఇదే నిజమని తెలుగు సినిమాలను ప్రశంసిస్తూ ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి సల్మాన్ ఖాన్ కూడా యాడ్ అయ్యాడు. ఎవరో తన సినిమాలను ట్రోల్ చేయడం ఎందుకు అన్నట్టుగా తానే స్వయంగా తన సినిమాలను ట్రోల్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేశాడు ఈ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్.
చెత్త సినిమాలు
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘సికందర్’. మార్చి 28న ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. అందుకే ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో సల్మాన్ ఖాన్ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఒక స్పెషల్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ప్రెస్ మీట్‌లో బాలీవుడ్ ఉన్న పరిస్థితిపై స్పందించాడు సల్మాన్. ‘‘ఇంత చెత్త సినిమాలు తెరకెక్కిస్తున్నప్పుడు ఫ్లాప్ అవ్వక ఏమవుతాయి. అన్నీ చెత్త సినిమాలే తెరకెక్కుతున్నాయి’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ సీనియర్ హీరో. అంతే కాకుండా తన సినిమాలు కూడా చెత్త సినిమాలే అంటూ సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నాడు.
నాదే బాధ్యత
ఒక సినిమాను చూడడానికి ఆడియన్స్ థియేటర్లకు రావాలంటే అది పూర్తిగా హీరోపైనే ఆధారపడి ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. బాక్సాఫీస్ వద్ద మంచిగా ఆడిన సినిమాలు మాత్రమే మంచి సినిమాలు అని, మిగతావి చెత్త సినిమాలు అని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సల్మాన్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ బాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు 2023లో తను నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది భారీ డిశాస్టర్‌గా నిలిచింది. ఆ డిశాస్టర్‌కు తానే బాధ్యత తీసుకుంటానని తెలిపాడు సల్మాన్. హీరో అనేవాడు సినిమాకు ఫేస్ లాంటి వాడు కాబట్టి మూవీ ఫ్లాప్ అయితే నింద కూడా తనపైనే పడాలని అన్నాడు.
Also Read: ఐశ్వర్య ఛాన్స్ ఇవ్వలేదు.. రొమాన్స్‌సపై బాద్‌షా ఓపెన్ కామెంట్..
క్వాలిటీ లేదు
హిందీ సినిమాలో ప్రస్తుతం రైటింగ్ విషయంలో క్వాలిటీ తగ్గిపోయిందని బయటపెట్టాడు సల్మాన్ ఖాన్ (Salman Khan). రైటర్స్ అనేవాళ్లు తమకోసం కథలు రాసుకుంటున్నారని అన్నాడు. దర్శకుడు, నిర్మాతలు తమ ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్‌ను ప్రేక్షకులకు చూపించుకోవడానికి మాత్రమే పోటీపడుతున్నారు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో తెలుసు అని, వారిని విమర్శించడం కరెక్ట్ కాదన్నాడు. మంచి కథలతో సినిమాలు తీయాలని, బాలీవుడ్‌లో అది జరగడం లేదని వాపోయాడు. ఈరోజుల్లో ఫండ్స్ దొరికాయని, హీరోయిన్‌కు పెళ్లి అయిపోతుందని, హీరో డేట్స్ దొరికాయని సినిమాలు తీస్తున్నారని, స్క్రిప్ట్ గురించి ఎవరూ ఆలోచించడం లేదంటూ బాలీవుడ్ పరిస్థితిని ఓపెన్‌గా చెప్పేశాడు సల్మాన్ ఖాన్.