NTR: 2025 మార్చి 28న విడుదలైన‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. 2023లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. కళ్యాణ్ శంకర్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై హారిక సూర్యదేవర మరియు సాయి సౌజన్య నిర్మించగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ దేవర 2 గురించి చెప్పుకొచ్చాడు..!
దేవర 2 సాలిడ్ అప్డేట్.. ఖచ్చితంగా ఉంటుంది
దేవర చిత్రాన్ని ఆదరించినందుకు, మీ అందరీ భుజాల మీద మోసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా చెబుతున్నాను.. దేవర 2 లేదు అని అనుకుంటున్న వారందరికీ చెబుతున్నాను. దేవర 2 ఉంటుంది. ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దేవర తర్వాత మధ్యలో ఒక చిన్న పాజ్ ఇచ్చాము. ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి. అంతే తప్ప దేవర 2 ఉండదనే వార్తల్లో నిజం లేదని అన్నారు. ఇక ఈవెంట్ దేవర ప్రీ రిలీజ్, సక్సెస్ ఈవెంట్ లాంటిదని మ్యాడ్ స్క్వేర్‌లో నటించిన రామ్ నితిన్ చెప్పుకొచ్చారు. ఇదే జోష్‌లో దేవర 2 అప్డేట్ ఇచ్చి ఫుల్ ఖుషీ చేశాడు యంగ్ టైగర్. ఇక టైగర్ స్పీచ్‌కు ఆడిటోరియం దద్దరిల్లింది. ఆయన నయా లుక్ చూసి డ్రాగన్ లుక్ అంటూ రచ్చ చేశారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చాలా నవ్వుతూ కనిపించారు.
వంద కోట్ల దిశగా మ్యాడ్ స్క్వేర్
‘మ్యాడ్ స్క్వేర్’ విడుదలైన మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. మొదటి రోజు రూ. 20.8 కోట్ల గ్రాస్ వసూలు చేసి, మూడు రోజుల్లో రూ. 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 70 కోట్ల గ్రాస్ సాధించి బ్రేక్-ఈవెన్ మార్క్‌ను దాటేసింది. వంద కోట్ల వైపు సినిమా దూసుకుపోతోంది. అటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. చిన్న బడ్జెట్ సినిమాగా ప్రారంభమై భారీ విజయం దిశగా దూసుకుపోతుంది మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రథమార్ధంలో కామెడీ, పాటలు బాగా ఆకట్టుకున్నాయని, సెకండ్ హాఫ్‌లో సునీల్ ట్రాక్ హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.