OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులో అలియా భట్ హీరోయిన్ గా నటించి, ఈ సినిమాను నిర్మించింది. ఈ మూవీ ఒక మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇందులో మద్యానికి బానిస అయిన భర్తను మార్చే క్రమంలో స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ బాలీవుడ్ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘డార్లింగ్స్’ (Darlings). 2022లో విడుదలైన ఈ మూవీకి జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహించారు. ఇది ఆలియా భట్ నటించి, నిర్మించిన మొదటి సినిమా. అలియా భట్ తన నటనతో మెప్పించింది. ఇందులో ఆలియా భట్‌తో పాటు షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఆగస్టు 5, 2022న విడుదలైంది. ఇందులో గృహ హింస అనే అంశాన్ని, డార్క్ కామెడీ శైలిలో చూపించారు.
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ స్టోరీ ముంబైలోని ఒక లోయర్ మిడిల్ క్లాస్ పరిసర ప్రాంతంలో జరుగుతుంది. బద్రునిస్సా, హమ్జా ప్రేమ వివాహం చేసుకుని, ఆ ప్రాంతం లో నివసిస్తుంటారు. హమ్జా ఒక రైల్వే టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. మద్యపానానికి అలవాటు పడి, రాత్రిపూట బద్రును శారీరకంగా హింసిస్తుంటాడు. మూడు సంవత్సరాల పాటు ఈ హింసను భరిస్తూ, వస్తుంది బద్రు. తన భర్త మారతాడని ఆశతో ఉంటుంది. ఆమె అతని మద్యపానాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అతని ఆహారంలో మద్య వ్యతిరేక మాత్రలు కలపడం, గర్భం దాల్చడం ద్వారా అతన్ని మార్చాలని ఆలోచించడం వంటివి చేస్తుంది. కానీ హమ్జా మారకపోగా, ఆమెను హింసించే తీరు మరింత తీవ్రమవుతుంది. బద్రు తల్లి షమ్షునిస్సా ఒక వితంతువు. తన కూతురు ఈ వివాహం అనే నరకంలో, చిక్కుకోవడం చూసి ఆందోళన చెందుతుంది. ఒక రోజు హమ్జా హింస తీవ్రమైన స్థాయికి వెళ్తుంది. అతని ప్రవర్తన వల్ల, బద్రుకి గర్భస్రావం కావడానికి కారణమవుతుంది.
ఈ సంఘటన బద్రును పూర్తిగా మార్చేస్తుంది. ఆమె తన తల్లి సహాయంతో, హమ్జాకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. వారు హమ్జాను బంధించి, అతన్ని శిక్షించే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల్లోకి చిక్కుకుంటారు. హమ్జా, బద్రు తల్లినే బుట్టలో పడేయాలని చూస్తాడు. ఇక్కడ కొన్ని సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ తరువాత హమ్జా వాళ్ళ నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. బద్రు, షమ్షు అతన్ని హింసించారని ఆరోపిస్తాడు. అయితే బద్రు తన జీవితాన్ని ఒంటరిగా ఉంచుకోవడానికి సిద్దపడుతుంది. హమ్జా నుండి విముక్తి పొందాలని అనుకుంటుంది. చివరికి బద్రు భర్త నుంచి విడిపోతుందా ? లేకపోతే కలసి ఉంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ మహిళలకు కనువిప్పు కలిగించే విధంగా ఉంటుంది. మధ్యతరగతి కష్టాలు ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు.