Alekhya Chitti Pickles: సోషల్ మీడియాలో ఏదైనా విషయం వైరల్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. ఇటీవల వైరల్ అవుతున్న విషయాలు చూస్తుంటేనే దీనిపై ఒక క్లారిటీ వచ్చేస్తోంది. అసలు సోషల్ మీడియాలో ఏదైనా ఎందుకు వైరల్ అవుతుందో, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని కూడా ఆలోచించడం మానేశారు నెటిజన్లు. ఒకరు ఒక విషయాన్ని ట్రోల్ చేయడం మొదలుపెడితే.. మరో వెయ్యి మంది వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా అదే విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. అలా ఇటీవల ట్రోల్స్‌కు గురయిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. ఈ సోషల్ మీడియా ట్రెండ్‌ను ఫాలో అవ్వడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ సైతం రంగంలోకి దిగాయి. ఏకంగా ప్రభాస్ వీడియోనే ఈ ట్రోలింగ్ కోసం ఉపయోగించుకున్నారు.
ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా
ఒక్క ఆడియో వల్ల అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పేజ్, దానిని క్రియేట్ చేసిన అమ్మాయిలు.. అందరూ ఫేమస్ అయిపోయారు. కానీ అది పాజిటివ్ విషయం కాదు.. వాళ్లు ఫేమస్ అయ్యింది నెగిటివ్ కారణాల వల్ల. ఆ ఆడియోలో అలేఖ్య అనే అమ్మాయి మాట్లాడిన బూతుల వల్ల వారి గురించి అంతటా వైరల్ అయ్యింది. పచ్చళ్లు కొనలేని మనుషులు.. పెళ్లానికి బంగారం ఎలా కొంటారు అంటూ ఒక వ్యక్తిపై అలేఖ్య చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. దీంతో పెళ్లి చేసుకోవాలంటే పచ్చళ్లు కొనే స్థోమత ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విషయంపై ఎన్నో మీమ్స్, రీల్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇక తాజాగా జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ లాంటి యాప్స్ సైతం దీనిపై ట్రోలింగ్ మొదలుపెట్టాయి.
ప్రభాస్ సీన్‌తో
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ సినిమాలో హీరో పచ్చడి తయారు చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్‌ను ఈ సందర్భంగా మరోసారి స్పెషల్‌గా పోస్ట్ చేసింది జియో హాట్‌స్టార్. దీనికి ‘బయట పచ్చళ్లు చాలా కాస్ట్‌లీ ఉంటున్నాయి. ఇంట్లోనే పెట్టుకుందాం’ అంటూ వ్యంగ్యంగా క్యాప్షన్ యాడ్ చేశారు. ‘మనం ప్రస్తుతం పచ్చళ్ల ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు మిర్చీ కావాలంటే హాట్‌స్టార్‌లోనే చూడాలి’ అంటూ ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. అలేఖ్య చిట్టి పికిల్స్‌ను హాట్‌స్టార్ ట్రోల్ చేయడంతో పాటు దానికోసం ప్రభాస్ సీన్‌ను ఉపయోగించుకున్నారంటూ నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
Guess we're in a pickle 🫠
Ippudu mirchi kaavali ante, hotstar lone chuddali 🙃#Chatrapathi #Prabhas #HomemadePickle #JioHotstarTelugu pic.twitter.com/tqAC5ELmLg
— JioHotstar Telugu (@JioHotstarTel_) April 3, 2025
Also Read: ముసలోళ్లు వద్దు.. కుర్రాళ్లే ముద్దు.. సంచలన కామెంట్లు చేసిన తమన్నా..
ఎన్నో ట్రోల్స్
ఇక ఈటీవీ విన్ సైతం ‘సూర్యవంశం’లోని ఒక సీన్‌ను పోస్ట్ చేస్తూ అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles)ను ట్రోల్ చేసింది. పెళ్లి చేసుకోవాలంటే ఒక అమ్మాయి కోరుకునే లక్షణాల గురించి హీరోయిన్ చెప్పిన మాటలను పోస్ట్ చేస్తూ కెరీర్ గురించి సీరియస్‌గా ఆలోచించండి అంటూ ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వ్యంగ్యమైన పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు, మీమర్స్ మాత్రమే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా వారి సినిమాలను ప్రమోట్ చేయడం కోసం ఇలాంటి ట్రోల్ కంటెంట్‌ను ఎంపిక చేసుకుంటున్నారని అందరూ ఫీలవుతున్నారు.
It's time to focus on your career🙂 pic.twitter.com/fQuZRXy5QC
— ETV Win (@etvwin) April 3, 2025