BigTV English
Advertisement

Devara 2: ‘దేవర 2’ ఊహించని అప్డేట్.. మొత్తం లీక్ చేసిన ఎన్టీఆర్!

Devara 2: ‘దేవర 2’ ఊహించని అప్డేట్.. మొత్తం లీక్ చేసిన ఎన్టీఆర్!

Devara 2: జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ (NTR) కొరాటాల శివ (Koratala Shiva) కాంబినేషన్లో వచ్చిన దేవర పార్ట్ 1 మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27, 2024న రిలీజ్ అయిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్… దేవర, వర పాత్రలో నటించగా.. జాన్వీ కపూర్ తంగం పాత్రలో నటించింది. సైఫ్ అలీ ఖాన్ భైరవగా విలన్ పాత్రలో నటించాడు. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీంతం అందించగా.. నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మించాయి. అయితే.. దేవర పార్ట్ 1కు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ క్రేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విసూలు చేసింది. ఏకంగా 500 కోట్లు వసూలు చేసి.. ఎన్టీఆర్-రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. దీంతో.. దేవర పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీఆర్ దేవర 2 గురించి చేసిన లీకేజీ నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అయ్యేలా ఉంది.


‘దేవర 2’ చాలా పెద్దది!

“దేవర: పార్ట్ 2” (Devara 2) గురించి ఎన్టీఆర్ ఇటీవల జపాన్‌లో “దేవర: పార్ట్ 1” ప్రమోషన్స్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడ ఉండగా, ఒక సంభాషణలో పార్ట్ 2 కథ గురించి కొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “దేవర 2” కథ పార్ట్ 1 కంటే చాలా పెద్దగా, ఆకట్టుకునేలా ఉంటుందని, ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచే అంశాలు ఉంటాయని చెప్పారు. పార్ట్ 1లో ప్రేక్షకులు దేవర పాత్ర గురించి తెలుసుకున్నారని, కానీ పార్ట్ 2లో దేవర కొడుకు వర గురించి మరింత లోతుగా తెలుస్తుందని ఆయన వెల్లడించారు. అంతేకాక, “దేవరకు ఏమైంది?” అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుందని హింట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, అభిమానులు రెండో భాగం కోసం మరింత ఆసక్తికరంగాగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవరకు ఏమైందనే చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ మాటలు ఓ రేంజ్‌లో హైప్ ఇస్తున్నాయి.


‘దేవర 2’ ఎక్కడి వరకు వచ్చింది?

ప్రస్తుతం ఎన్టీఆర్ “వార్ 2” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావొచ్చింది. దీంతో.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ ప్రశాంత్ నీల్‌ షూటింగ్‌లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే “దేవర 2” పనులు మొదలవుతాయని సమాచారం. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కొరటాల శివ పవర్ ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడు. పార్ట్ 1లో వదలేసిన చాలా ప్రశ్నలకు “దేవర2″తో సమాధానాలు లభిస్తాయని, ఇది అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అవుతుందని.. తాజాగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోసారి దేవర ఊచకోత టైగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎర్ర సముద్రం పై దేవర దండయాత్ర కోసం చూస్తున్నారు. త్వరలోనే.. దేవర 2 నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×